యాక్షన్... స్పీడ్.. టైమింగ్స్‌లో ‘సాహో’ది డిఫరెంట్ స్టైల్! ‘షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 1’ వీడియో చూసిన వారికి ఈ విషయం అర్థం అవుతోంది. ఇప్పుడు ‘షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 2’ వీడియోను రిలీజ్ చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోందని తెలిసింది. ‘షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 1’ను ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా విడుదల చేశారు. వచ్చే నెల 4న మహాశివరాత్రి. 3న ‘సాహో’ చిత్ర కథానాయిక శ్రద్ధాకపూర్ బర్త్ డే. ఈ రెండు సందర్భాలను పురస్కరించుకుని ‘సాహో’ బృందం చాప్టర్ 2 వీడియోను విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. అంటే.. ఇట్స్ సాహో టైమ్ అన్నమాట. ‘సాహో’ చిత్రంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్నారు. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దాదాపు 300కోట్ల బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్నారు.
కెన్నీ బెట్స్ వంటి యాక్షన్ కొరియోగ్రాఫర్ ఈ సినిమాకు వర్క్ చేస్తున్నారు. ‘డినో యురి 18 కెడబ్ల్యూ’ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సినిమా విజువల్స్‌ని క్యాప్చర్ చేస్తున్నారు. భారీ గ్రాఫిక్స్ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయి. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో వేసిన సెట్‌లో జరుగుతోంది. ఈ సినిమాకు శంకర్–ఎహసన్–లాయ్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ రచయిత అమితాబ్ భట్టాచార్య హిందీ లిరిక్స్‌ను అందిస్తున్నారు. ‘‘ఆల్రెడీ విడుదల చేసిన ఫస్ట్‌లుక్, ‘షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 1’కి మంచి స్పందన లభిస్తోంది. మార్చి 3న ‘షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 2’ను విడుదల చేయబోతున్నాం’’ అని చిత్ర బృందం పేర్కొంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందుతున్న ‘సాహో’ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది. హిందీలో ఈ సినిమాను నిర్మాత భూషన్ కుమార్ రిలీజ్ చేయనున్నారని తెలిసింది.
ఇట్స్ సాహో టైమ్!
Published Mon, Feb 25 2019 12:01 AM | Last Updated on Wed, Jul 17 2019 10:14 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment