
మొగ్గ దశలో పసుపు వర్ణంలో..
రామభద్రపురం (బొబ్బిలి) : ఊసరవల్లిలా రంగులు మార్చుతున్న పుష్పం‘గులాబీ పువ్వై నవ్వాలి వయసు.. జగాన వలపే నిండాలిలే’ అయు ఒక కవి రాశాడు. ప్రేమజంటల చేతిలో ఈ పూలను చూస్తుంటాం.. అసలు గులాబీ పువ్వుని ప్రేమించకుండా.. ఆరాధించకుండా ఎవరుంటారు. అరవిరిసిన గులాబీ వర్ణం అద్భుతం.. అది విభిన్న వర్ణాలను సంతరించుకుంటే అపూర్వం.
అలాంటి గులాబీ రామభద్రపురం చొక్కాపువీధిలోని చొక్కాపు సత్యవతి ఇంటి ఆవరణలో అందాలు చిందిస్తోంది. మొగ్గ దశలో పసుపు రంగులో.. పూర్తిగా వికసించే సరికి గులాబీ రంగులోకి మారిపోతూ కనువిందు చేస్తోంది. ఈ విషయాన్ని ఉద్యానశాఖాధికారి ఎస్ వెంకటరత్నం వద్ద ప్రస్తావించగా హైబ్రిడ్ రకానికి చెందిన మొక్కలే ఇలాంటి పూలు పూస్తాయని తెలిపారు.

గులాబీ రంగులోకి మారుతూ..

పూర్తిగా గులాబీ రంగులోకి మారిన పువ్వు
Comments
Please login to add a commentAdd a comment