
తెల్లగులాబీ శాంతికి, సమైక్యతకు చిహ్నం. ఈ పూవును ఒకదానిని చూస్తేనే మనసు పులకిస్తుంది. అలాంటిది ఒకేసారి మూడు పూలు.. అదీ ఒకే రెమ్మకు పూస్తే.. వాటిని చూసిన కనులకు పండగ కాదా.. మనసు పరవళ్లు తొక్కదా.. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలోని పఠాన్ అజ్గర్ వలీ(నన్నా) ఇంటి పెరట్లోని చెట్టుకు గులాబీ పూలు విరగబూశాయి. వీటిలో ఒకే రెమ్మకు మూడు తెల్ల గులాబీలు ఉన్నాయి. ఇవి అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాయి. అన్నట్టు అజ్గర్ వలీ దంపతులకు ముగ్గురు కవల పిల్లలు(ట్రిప్లేట్స్). ఈ నేపథ్యంలో ఒకే రెమ్మకు మూడు గులాబీలు పూయడం విశేషం. – జంగారెడ్డిగూడెం రూరల్
Comments
Please login to add a commentAdd a comment