ప్రతీకాత్మక చిత్రం
వాషింగ్టన్: కారు కనిపించగానే ఎత్తుకెళ్లిన ఓ దొంగ అందులో ఓ పసిప్రాణం ఉందని తెలియగానే వెంటనే యూటర్న్ తీసుకుని ఆ చిన్నారిని తల్లికి అప్పగించాడు. కానీ కారును మాత్రం విడిచిపెట్టలేదు. అంటే ఆ దొంగ మంచోడా? చెడ్డోడా? అసలా దొంగ ఏం చేశాడో తెలియాలంటే ఈ స్టోరీ చదివేయండి.. అమెరికాలోని ఒరెగాన్ రాష్ట్రం పోర్ట్‌ల్యాండ్‌లో శనివారం నాడు ఓ మహిళ నాలుగేళ్ల కొడుకును తీసుకుని కారులో షాపుకు వెళ్లింది. కారును రన్నింగ్‌లో ఉంచి, అందులో చంటిపిల్లాడిని ఒంటరిగా వదిలేసి దుకాణంలోకి వెళ్లి పాలు, మాంసం కొనుగోలు చేసింది. (చదవండి: నేను వచ్చిన బిడ్డో సర్కారు దవాఖానకు!)
ఇంతలో అక్కడే ఉన్న ఓ దొంగ కారెక్కి ఎంచక్కా ఎత్తుకెళ్లిపోయాడు. అయితే కొంత దూరం వెళ్లాక కారులో పసిపిల్లాడు ఉన్నాడని గుర్తించి యూటర్న్ తీసుకుని తిరిగి అదే షాపుకు దగ్గరకు వెళ్లాడు. బుడ్డోడిని అలా వదిలేసి పోతావా? అని సదరు మహిళకు ఆవేశంతో క్లాస్ పీకాడు. అంతే కాదు, నిర్లక్క్ష్యంగా వ్యవహరించినందుకు పోలీసులకు పట్టిస్తానంటూ బెదిరించి చిన్నోడిని ఆమె చేతుల్లో పెట్టాడు. ఇతడు మంచి దొంగే అనుకునేలోపే తిరిగి అదే కారులో ఉడాయించాడు. అయితే చంటోడిని తల్లికి అప్పజెప్పినందుకు పోలీసులు అతడిని నిజాయితీ గల దొంగగా అభివర్ణిస్తున్నారు. ఈ ఘటన జరిగిన కొద్ది గంటలకే తిరిగా ఆ కారును గుర్తించి మహిళకు అప్పజెప్పగా ప్రస్తుతం దొంగ జాడ కోసం గాలింపు చేపట్టారు. (చదవండి: వైరల్: గుడి దగ్గరకు రాగానే ఫోన్ చేయండి!)
Comments
Please login to add a commentAdd a comment