వాషింగ్టన్ : సాధారణంగా మనుషుల్లో ఆడ, మగతో పాటు నపుంసకులు ఉంటారన్నది తెలిసిన విషయమే. కానీ జంతువుల్లోనూ నపుంసక జంతువులు ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా గొర్రెల జాతికి సంబంధించి 12 గొర్రెల్లో ఒకటి నపుంసకత్వాన్ని కలిగి ఉందని పోర్ట్‌లాండ్‌లోని ‘‘ఓరెగాన్ హెల్త్ అండ్ సైన్సెస్ యూనివర్శిటీ’’ చెందిన ప్రొఫెసర్ చార్లెస్ రోసెల్లీ పేర్కొన్నారు. గొర్రెల జెండర్ అన్నది తల్లి గర్భంలోనే నిర్ణయించబడుతుందని ఆయన అభిప్రాయపడుతున్నారు. నపుంసక గొర్రెలు ఆడవాటితో కలవటానికి ఇష్టపడకపోవటం వల్ల వాటిని వధశాలలకు తరలించటం జరుగుతోందని చెప్పారు.
దాదాపు ఎనిమిది శాతం గొర్రెలు నపుంసకత్వాన్ని కలిగి ఉన్నాయని అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా కొన్ని రకాల కోతులు, కుక్కలు, తాబేళ్లు, సింహాలు కూడా నపుంసకత్వాన్ని కలిగి ఉన్నాయని వెల్లడించారు. చానల్ 4ఎస్ రూపొందించిన ‘‘మై గే డాగ్ అండ్ అదర్ అనిమల్స్’’ అనే డాక్కుమెంటరీలో ఈ వివరాలను ప్రస్తావించారు.
Comments
Please login to add a commentAdd a comment