పోర్ట్లాండ్‌లో బతుకమ్మ, దసరా సంబురాలు | People celebrate Bathukamma, Dasara celebrations in Portland | Sakshi
Sakshi News home page

పోర్ట్లాండ్‌లో బతుకమ్మ, దసరా సంబురాలు

Published Wed, Oct 11 2017 2:38 PM | Last Updated on Mon, Jul 29 2019 6:03 PM

People celebrate Bathukamma, Dasara celebrations in Portland - Sakshi

సాక్షి, పోర్ట్లాండ్‌: అమెరికాలోని ఓరెగాన్ స్టేట్‌లోని పోర్ట్లాండ్ నగరంలో బతుకమ్మ, దసరా సంబురాలు చాలా ఘనంగా జరిగాయి. ఈ సంబురాలను తెలంగాణ డెవలప్మెంట్‌ ఫోరమ్, పోర్ట్లాండ్ చాఫ్టర్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు పోర్ట్లాండ్‌ మెట్రో నగరాల నుంచి దాదాపుగా 600 మంది హాజరయ్యారు. ఈ వేడుకలను పోర్ట్లాండ్‌ చాఫ్టర్ చైర్మన్‌ అనుమాండ్ల జ్యోతి ప్రజ్వాలన చేసి ప్రారంభించారు.

తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా సంప్రదాయ దుస్తులో మహిళలు, చిన్నారులు ఆటపాటలతో బతుకమ్మ ఆడారు. బతుకమ్మ పోటీలు నిర్వహించి గెలిచిన వారికి అనుమాండ్ల బహుమతులను బహుకరించారు. అనంతరం వాలంటీర్ల సహాయంతో స్కూల్‌ దగ్గర్లో ఉన్న కొలనులో బతుకమ్మను నిమ్మజ్జనం చేశారు.

తదనంతరం దసరా పండుగ సందర్భంగా టీడీఎఫ్‌ టీం జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జమ్మి ఇచ్చి పెద్దవారితో ఆశీర్వాదం తీసుకున్నారు. చైర్మన్‌ అనుమాండ్ల కార్యక్రమానికి వచ్చిన వారందరికీ బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పండుగ ఘనంగా  జరుపుకోవటానికి సహకరించిన మహిళలందరికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.రఫెల్‌ టికెట్స్‌ గెలిచిన వారికి శ్రీని గిఫ్ట్‌ కార్డ్స్‌ బహుకరించారు. చివరగా అందరూ ఢీ జె మ్యాజిక్‌కి డాన్స్‌ చేసి ఎంజాయ్‌ చేశారు.

ఈ కార్యక్రమంలో టీడీఎఫ్‌ పోర్ట్లాండ్‌ చాఫ్టర్‌ కమిటీ మెంబర్స్‌‌, వాలంటీర్స్‌ టీం సభ్యులు.. కొండల్‌ రెడ్డి పుర్మ, రఘుస్వామి, మధుకర్‌ రెడ్డి పురుమాండ్ల, నిరంజన్‌ కూర, నరేందర్‌ చీటి, జయాకర్‌ రెడ్డి ఆడ్ల, శివ ఆకుతోట, సత్యసింహరాజ, ప్రవీణ్‌ అన్నవజ్జల, రాజ్‌ అందోల్‌, వీరేష్‌ బుక్కా, సురేశ్‌ దొంతుల, ప్రవీణ్‌ ఎలకంటి, అజయ్‌ అన్నమనేని శ్రీని బొంతల, వెంకట్‌ ఇంజం, శ్రీనివాస్ రెడ్డి పగిడి, కృష్ణారెడ్డి అయిలూరి, శ్రీని గుబ్బ, రామ్‌ పప్పుల, గణేష్‌ ప్రభల, వెంకట్ రెడ్డి గోగిరెడ్డి, అంజి పల్లాటి, కిరీట్‌ పోల, వారి కుటుంబాలకు చాఫ్టర్ చైర్మన్‌ శ్రీని హృదయ పూర్వక అభినందలు తెలియజేశారు.
 









No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement