నగ్న ఎథ్లెట్ ను గుద్దేసి పోయిన నల్లకారు | Naked athlete knocked down by car | Sakshi
Sakshi News home page

నగ్న ఎథ్లెట్ ను గుద్దేసి పోయిన నల్లకారు

Published Tue, May 6 2014 5:22 PM | Last Updated on Tue, Oct 16 2018 8:34 PM

Naked athlete knocked down by car

'పుట్టినప్పుడు బట్ట కట్టలేదు... పోయేటప్పుడు అది వెంటరాదు...' అంటూ నందామయా గురుడ నందామయా తత్వం ఆ మనిషికి బాగా ఒంటపట్టింది. అందుకే నడిరోడ్డుపై బట్టలన్నీ విప్పేసి నగ్నంగా జాగింగ్ చేస్తూ, మధ్యమధ్యలో పుష్ అప్స్  చేస్తూ ఆనందించేస్తున్నాడు ఆ పెద్దమనిషి. 
 
దీన్ని చూసిన ప్రజలు పోలీసులకు ఫోను చేసి 'బాబూ .... ఇక్కడ ఉచితంగా సినిమా చూపించేస్తున్నాడు ఓ పెద్దమనిషి. దయచేసి అరెస్టు చేయండి' అని చెప్పారు. పోలీసులు హడావిడిగా బయలుదేరేలోపు మూడో ఫోన్ కాల్ వచ్చింది. 'నగ్న ఎథ్లెట్ ని ఒక నల్ల కారు గుద్దేసి వెళ్లిపోయింది' అని సమాచారం ఇచ్చింది. పోలీసులు సదరు నగ్న ఎథ్లెట్ శవాన్ని ఆస్పత్రికి తరలించారు.
 
అయితే అతడిని గుద్దేసిన కారు డ్రైవర్ పోలీసులు వచ్చే దాకా అక్కడే ఉండి, వారికి పూర్తిగా సహకరించడం విశేషం.ఈ సంఘటన అమెరికాలోని ఒరెగన్ రాష్ట్రంలోని పోర్ట్ లాండ్ లో జరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement