
న్యూయార్క్: తల మీద పొడిచిన కత్తితో ఓ వ్యక్తి రోడ్లపై కనిపించడం ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మంగళవారం న్యూయార్క్‌లో ఓ మహిళ పర్సును కొందరు దుండగులు లాక్కునేందుకు ప్రయత్నించగా ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో సదరు మహిళపై వారు చేయి చేసుకోగా ముప్పై ఆరేళ్ల యువకుడు ఆమెను కాపాడేందుకు యత్నించాడు. ఈ క్రమంలో దుండగులు అతడిపై కత్తితో దాడి చేశారు. (తెల్ల చర్మం... నల్ల మచ్చలు..)
తల, మొండెంపై కత్తిపోట్లతో విరుచుకుపడటంతో అతని బట్టలు రక్తసిక్తమయ్యాయి. వీడియోలో అతని రెండు చేతులు రక్తంలో తడిసినట్లు ఉండగా, కుడి చేతికి కట్టు కట్టినట్లు తెలుస్తోంది. దీంతో అతను తనను తాను కాపాడుకునేందుకు రోడ్ల వెంట నడుస్తూ అంబులెన్స్ సాయం కోరాడు. తీవ్రంగా గాయపడిన అతడిని హార్లేమ్‌లోని ఆసుపత్రికి తరలించారు. మరోవైపు సదరు మహిళ కూడా కత్తిపోట్లకు గురవగా ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు తెలిసింది. (నిరసనకారుడిని ఒక్కసారిగా తోసేయడంతో..)
Comments
Please login to add a commentAdd a comment