పోలీసులకు రోహిత్ శర్మ రిక్వెస్ట్ (PC: X)
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మంచి మనసు చాటుకున్నాడు. తనకు అసౌకర్యం కల్పించినప్పటికీ.. అభిమాని పట్ల కాస్త ఉదారంగా వ్యవహరించాలని అమెరికా పోలీసులను కోరాడు.
అసలేం జరిగిందంటే.. టీ20 ప్రపంచకప్-2024 టోర్నీకి వెస్టిండీస్‌తో కలిసి అమెరికా తొలిసారిగా ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఇక టీమిండియా లీగ్ దశలో తమ మ్యాచ్‌లన్నీ ఇక్కడే ఆడనుంది.
ఈ క్రమంలో ఐసీసీ ఈవెంట్ సన్నాహకాల్లో భాగంగా రోహిత్ సేన శనివారం రాత్రి(భారత కాలమానం ప్రకారం) బంగ్లాదేశ్‌తో వార్మప్ మ్యాచ్ ఆడింది. న్యూయార్క్‌లోని నసావూ కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియం ఇందుకు వేదిక.
దంచికొట్టిన పంత్.. హార్దిక్
ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా బంగ్లాదేశ్‌ను 60 పరుగుల తేడాతో ఓడించింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి విశ్రాంతి పేరిట దూరం కాగా.. కెప్టెన్ రోహిత్ శర్మ(23)తో కలిసి సంజూ శాంసన్(1) ఇన్నింగ్స్ ఆరంభించాడు.
ఇక రీఎంట్రీలో రిషభ్ పంత్(32 బంతుల్లో 53) అదరగొట్టగా.. సూర్యకుమార్ యాదవ్(31), హార్దిక్ పాండ్యా(23 బంతుల్లో 40 నాటౌట్) రాణించారు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది.
చెలరేగిన పేసర్లు
ఇక లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్‌కు భారత పేసర్లు చుక్కలు చూపించారు. జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్యా ఒక్కో వికెట్ తీయగా.. అర్ష్‌దీప్ సింగ్, శివం దూబే రెండేసి వికెట్లు కూల్చారు. స్పిన్నర్లలో అక్షర్ పటేల్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.
ఈ క్రమంలో 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి 122 పరుగులు మాత్రమే చేసిన బంగ్లాదేశ్ టీమిండియా చేతిలో చిత్తుగా ఓడింది. ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ సమయంలో రోహిత్ శర్మకు అసౌకర్యం కలిగింది.
రోహిత్‌కు భయానక అనుభవం: జాలి చూపాలంటూ హిట్‌మ్యాన్ రిక్వెస్ట్!
ఫీల్డింగ్ చేస్తున్నవేళ ఓ అభిమాని భద్రతా సిబ్బంది కళ్లు గప్పి రోహిత్‌వైపు దూసుకువచ్చాడు. అతడిని ఆలింగనం చేసుకునే ప్రయత్నం చేశాడు. ఇంతలో మైదానంలోకి దూసుకువచ్చిన పోలీసులు అతడిని కిందపడేసి.. కాస్త కఠినంగా ప్రవర్తించారు.
ఇంతలో రోహిత్ శర్మ జోక్యం చేసుకుని కాస్త కూల్‌గా డీల్ చేయాలని.. అతడిని ఎక్కువగా ఇబ్బంది పెట్టవద్దని పోలీసులను కోరాడు. ఈ క్రమంలో మరో ఇద్దరు పోలీసులు కూడా మైదానంలోకి వచ్చి సదరు అభిమానిని బయటకు తీసుకువెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చదవండి: రోహిత్, విరాట్ భార్యలను గమనిస్తేనే తెలిసిపోతుంది: గంగూలీ
The fan who breached the field and hugged Rohit Sharma was taken down by the USA police.
- Rohit requested the officers to go easy on them. pic.twitter.com/MWWCNeF3U2— Mufaddal Vohra (@mufaddal_vohra) June 1, 2024
Comments
Please login to add a commentAdd a comment