చాంద్రాయణగుట్ట: వివాహ విందులో నెలకొన్న వివాదం చిలికి చిలికి గాలివానలా మారి ముగ్గురి కత్తిపోట్లకు దారి తీసింది. ఛత్రినాక పోలీసుల కథనం ప్రకారం.. చాంద్రాయణగుట్టకు చెందిన అబ్రార్, ఇర్ఫాన్ సమీప బంధువులు. ఇద్దరూ తమ స్నేహితులతో కలిసి ఈనెల 4న బండ్లగూడలో జరిగిన బంధువుల పెళ్లి విందుకు వెళ్లారు. ఆ సమయంలో ఒక అమ్మాయి విషయమై అబ్రార్, ఇర్ఫాన్ గొడవ పడ్డారు. పెద్దలు ఇద్దరినీ సముదాయించి పంపేశారు. ఇదిలా ఉండగా... రాజీ కుదుర్చుకుందామని అబ్రార్ ఆరుగురితో, ఇర్ఫాన్ ఐదుగురితో మంగళవారం రాత్రి జంగమ్మెట్‌లోని బుడగ జంగాల బస్తీకి వచ్చారు.
ఆ సమయంలో మాటా మాటా పెరగడంతో ఇర్ఫాన్‌కత్తితో అబ్రార్‌పై కత్తితో దాడి చేశాడు. దీంతో ఇర్ఫాన్‌తో పాటు వచ్చిన ఫయీం, నదీంలపై అబ్రార్ బృందం కత్తితో దాడి చేసింది. సమాచారం అందుకున్న ఛత్రినాక పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఇరు వర్గాలపై కేసులు నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
అమ్మాయి కోసం వివాదం: ముగ్గురికి కత్తిపోట్లు
Published Thu, May 7 2015 2:26 AM | Last Updated on Sun, Sep 3 2017 1:33 AM
Advertisement
Advertisement