పాత భవనానికి తాళం వేసి నేటికి 4 ఏళ్లు
ఇటీవల 60 మంది వైద్యులు బదిలీ
తీవ్ర ఇబ్బందులు పడుతున్న రోగులు
అఫ్జల్‌గంజ్: పేదల పెద్దాసుపత్రిగా పేరుగాంచిన ఉస్మానియా జనరల్ ఆస్పత్రి పాత భవనానికి తాళం వేసి నేటికి నాలుగేళ్లు పూర్తవుతాయి. పాత భవనం మూసివేయడంతో ఆస్పత్రిలో స్థలాభావంతో అందుబాటులో ఉన్న స్థలంలోనే బెడ్లు సర్దుబాటు చేసి రోగులకు నాణ్యమైన వైద్య చికిత్సలు అందిస్తున్న ఉస్మానియా ఆస్పత్రికి ఇటీవల జరిగిన వైద్యుల బదిలీలు మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా మారింది.
నాలుగేళ్ల క్రితం కురిసిన భారీ వర్షాలకు ఉస్మానియా ఆస్పత్రి పాత భవనంలోకి నీరు రావడంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో అప్పటి ఆస్పత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ పాండూ నాయక్ నేతృత్వంలోని పరిపాలన విభాగం అధికారులు పాత భవనానికి 2020, జూలై 27న తాళం వేశారు.
అనంతరం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ కులీకుతుబ్‌షా భవనంలో నూతన షెడ్డును ఏర్పాటు చేసి రోగులకు సర్దుబాటు చేశారు. కాగా.. తాజాగా వైద్య శాఖలో జరిగిన బదిలీల్లో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్‌తో పాటు నిష్టాతులైన దాదాపు 22 మంది ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లతో కలిపి దాదాపు 60 మంది వైద్యులను ఒకేసారి బదిలీ చేయడంతో ఆస్పత్రి మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment