Hyderabad: Man Arrested For Assaulting Woman At Osmania Hospital - Sakshi
Sakshi News home page

Hyderabad Crime: ఉస్మానియా ఆస్పత్రిలో మహిళపై దాడి 

Published Sat, Aug 6 2022 1:03 PM | Last Updated on Sat, Aug 6 2022 1:29 PM

Hyderabad: Man Arrested For Assaulting Woman At Osmania Hospital - Sakshi

మహిళను కొడుతున్న డ్రైవర్‌  

సాక్షి, హైదరాబాద్‌: ఉస్మానియా ఆస్పత్రిలో ఓ మహిళపై దాడి చేసిన ప్రైవేటు అంబులెన్స్‌ డ్రైవర్‌ ఆరీఫ్‌ను అఫ్జల్‌గంజ్‌ పోలీసులు అరెస్టు చేశారు. ప్రైవేటు అంబులెన్స్‌ డ్రైవర్లు ఆస్పత్రి ప్రధాన గేటు ఎదుట, మార్చురీ వద్ద తిష్టవేసి రోగులను ముక్కుపిండి మరీ అధిక డబ్బులు వసూలు చేస్తుంటారు. ఈ క్రమంలో గురువారం రాత్రి ఆస్పత్రి ఆవరణలో ఫరీనా (45) అనే మహిళతో డ్రైవర్‌కు స్వల్ప వివాదం చోటు చేసుకుంది.

దీంతో అతను ఆమెపై దాడి చేసి, పక్కనే ఉన్న సెక్యురిటీతో కర్ర తీసుకొని కొట్టాడు. ఈ సంఘటనను గుర్తు తెలియని వ్యక్తి వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో అది వైరల్‌గా మారింది. అఫ్జల్‌గంజ్‌ పోలీసులు ఆరీఫ్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. ఆస్పత్రిలో తిష్టవేసి రోగులకు ఇబ్బందులు కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌  నాగేందర్‌ తెలిపారు. 
చదవండి: ‘చీకోటి’ కేసులో ఓ మంత్రి, ముగ్గురు ఎమ్మెల్యేలు? వాట్సాప్‌ చాట్లు వెలుగులోకి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement