Osmania General Hospital building
-
ఉస్మానియా ఆస్పత్రి ఖాళీ
అఫ్జల్‌గంజ్: పేదల పెద్దాసుపత్రిగా పేరుగాంచిన ఉస్మానియా జనరల్ ఆస్పత్రి పాత భవనానికి తాళం వేసి నేటికి నాలుగేళ్లు పూర్తవుతాయి. పాత భవనం మూసివేయడంతో ఆస్పత్రిలో స్థలాభావంతో అందుబాటులో ఉన్న స్థలంలోనే బెడ్లు సర్దుబాటు చేసి రోగులకు నాణ్యమైన వైద్య చికిత్సలు అందిస్తున్న ఉస్మానియా ఆస్పత్రికి ఇటీవల జరిగిన వైద్యుల బదిలీలు మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా మారింది. నాలుగేళ్ల క్రితం కురిసిన భారీ వర్షాలకు ఉస్మానియా ఆస్పత్రి పాత భవనంలోకి నీరు రావడంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో అప్పటి ఆస్పత్రి ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ పాండూ నాయక్ నేతృత్వంలోని పరిపాలన విభాగం అధికారులు పాత భవనానికి 2020, జూలై 27న తాళం వేశారు. అనంతరం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ కులీకుతుబ్‌షా భవనంలో నూతన షెడ్డును ఏర్పాటు చేసి రోగులకు సర్దుబాటు చేశారు. కాగా.. తాజాగా వైద్య శాఖలో జరిగిన బదిలీల్లో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్‌తో పాటు నిష్టాతులైన దాదాపు 22 మంది ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లతో కలిపి దాదాపు 60 మంది వైద్యులను ఒకేసారి బదిలీ చేయడంతో ఆస్పత్రి మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఉస్మానియా జనరల్ ఆస్పత్రి నిర్మాణంలో ఊగిసలాటలు
మహా నగరంతో పాటు పరిసర జిల్లాల ప్రజలకు వందల ఏళ్ల నుంచి ప్రాణ ప్రదాయిని. లక్షలాది మంది పేద రోగులకు ప్రాణభిక్ష పెట్టిన ఘన చరిత్ర. అద్భుతమైన భవన నిర్మాణ శైలికి ప్రతీక.. అడుగడుగునా ఉట్టిపడే కళా సౌందర్యం. కానీ.. కాలం రివ్వున తిరిగింది. అన్నింటికీ ఎక్స్పైరీ డేట్ ఉన్నట్టే ఆ కళాఖండం కూడా చరమాంక దశకు చేరుకుంది.. అదే నగర నడి»ొడ్డున శతాబ్దం క్రితం నిర్మించిన ఉస్మానియా జనరల్ ఆస్పత్రి. శిథిలావస్థకు చేరిన ఉస్మానియా పాత భవనం స్థానంలో కొత్తది నిర్మించి రోగులకు మెరుగైన వసతులు కల్పించాలని కొందరు.. చారిత్రక కట్టడాలను కూల్చవద్దని మరికొందరు వాదిస్తుండటంతో ఈ వివాదం కోర్టుకు చేరింది. ప్రభుత్వం కూడా ఎటూ తేల్చకుండా సందిగ్ధావస్థలో పడింది. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ ప్రత్యేక కథనం. సాక్షి, సిటీబ్యూరో/అఫ్జల్‌గంజ్: ఉస్మానియా జనరల్ ఆస్పత్రిని 1910లో రూ.50 వేల వ్యయంతో 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హయాంలో నిర్మితమైంది. డంగు సున్నం, గచ్చుతో రెండంతస్తుల్లో దీనిని నిర్మించారు. అప్పట్లో 200 మంది రోగులు చికిత్స పొందేవారు. పెరుగుతున్న రోగుల తాకిడితో పాత భవనం ప్రాంగణంలోనే 1971లో ఓపీ బ్లాకును నిర్మించారు. 1992లో కులీ కుతుబ్‌షా బ్లాక్‌ను నిర్మించారు. ప్రస్తుతం రోజూ సుమారు 2 వేల మంది అవుట్ పేషెంట్లు, మరో 200 మంది రోగులు ఇన్పేòÙంట్లుగా చికిత్స పొందుతున్నారు. దేశంలోని అత్యున్నత బోధనాసుపత్రుల్లో ఉస్మానియా ఆస్పత్రి ఒకటి. ప్రమాదకారిగా మారి.. ఎంతో మందికి ఎనలేని సేవలందిస్తూ వచి్చన ఉస్మానియా ఆస్పత్రి భవనం ఇప్పుడు పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. పెచ్చులూడిపోయి.. ఎప్పుడు కూలిపోతుందో తెలియని దుస్థితికి చేరుకుంది. జులై 2020లో భారీ వర్షాల కారణంగా వరద నీరు ఆస్పత్రి ప్రాంగణంలోకి చేరుకుంది. దీంతో చికిత్స పొందుతున్న రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. యుద్ధ ప్రాతిపదికన ఉస్మానియా ఆస్పత్రి పాత భవనాన్ని ఖాళీ చేయించారు. రోగులను వేరే భవనాల్లోని ఇతర వార్డుల్లో సర్దుబాటు చేశారు. పరిపాలనా విభాగంతో పాటు శస్త్రచికిత్సల విభాగాలను కూడా ఖాళీ చేయించారు. ఇప్పుడు ఉన్న భవనాల్లో కొత్త పేషెంట్లను చేర్చుకోవడం, రోగులకు సేవలందించడం చాలా కష్టంగా మారిపోయింది. ఎన్నాళ్లుగానో ఎదురుచూపులు.. ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవనం కోసం వేల మంది రోగులు కళ్లల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. కాకపోతే ఆదిలోనే హంసపాదు అన్నట్టుగా ఆస్పత్రి భవనం నిర్మాణానికి సవాలక్ష సవాళ్లు ఎదురవుతున్నాయి. చిక్కుముడుల వలలో చిక్కుకుపోతోంది. వందేళ్ల కింద నిర్మించిన భవనం కావడం.. హెరిటేజ్ భవనాల జాబితాలో ఉండటంతో దీన్ని కూల్చడం కష్ట సాధ్యంగా మారింది. దీన్ని ఇలాగే ఉంచి మిగిలిన ప్రాంతంలో కొత్త భవనం నిర్మించాలని కొందరు అంటున్నారు. అయితే.. పాత భవనాన్ని కూల్చేసి పూర్తిగా కొత్త భవనం నిర్మిస్తే పూర్తి స్థాయిలో రోగులకు అన్ని రకాల వసతులు అందుబాటులోకి తీసుకురావొచ్చని చెబుతున్నారు. గత ప్రభుత్వం కూడా పాత భవనాన్ని కూల్చి కొత్త భవనం నిర్మాణం చేపట్టాలని భావించింది. కొందరు దీనిపై కోర్టుకెళ్లారు. దీంతో ప్రతిష్టంభన కొనసాగుతోంది. కమిటీ ఇలా చెప్పింది.. ఉస్మానియా ఆస్పత్రి పాత భవనం స్థితిగతులు, కొత్త భవనం నిర్మాణం సాధ్యాసాధ్యాలపై అప్పటి ప్రభుత్వం ఓ కమిటీ ఏర్పాటు చేసింది. పాత భవనం ఉపయోగించేందుకు పూర్తిగా పనికి రాదని తేలి్చంది. భవనానికి మరమ్మతులు చేయొచ్చని, ఆస్పత్రి కోసం కాకుండా వేరే వాటి కోసం వాడుకోవచ్చని సూచించింది. ఇలా చేస్తే ఆస్పత్రికి కొత్త భవనాన్ని నిర్మించే స్థలం తక్కువ అవుతుందని పలువురు అభ్యంతరం వ్యక్తంచేశారు. దీంతో మళ్లీ కథ మొదటికి వచ్చింది.25 ఎకరాల్లో పది అంతస్తుల్లో.. పాత భవనాన్ని కూల్చేసి కొత్త భవన సముదాయాన్ని దాదాపు 25 ఎకరాల్లో నిర్మించాలని ఆస్పత్రి పరిపాలనా విభాగం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఒక్కో టవర్‌లో సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు పది అంతస్తుల్లో భవనం నిర్మించాలని సూచించింది. ఒక్కో టవర్‌ను 6 లక్షల చదరపు అడుగుల స్థలంలో నిర్మించాలని పేర్కొంది. దీంతో రోగులతో పాటు, వైద్య విద్యార్థులు, డాక్టర్లకు అన్ని రకాల సదుపాయాలు అందించవచ్చని తెలిపింది. నర్సింగ్ కాలేజీ కూడా నిర్మించే అవకాశం ఉంటుందని వివరించింది. ఇలా మొత్తం 35,75,747 చదరపు అడుగుల స్థలం అవసరం ఉంది. అక్కడ నిర్మించాలని ప్రతిపాదన.. పాత భవనం హెరిటేజ్ జాబితా కిందకు రావడంతో దాన్ని కూల్చకుండా మధ్య మార్గంలో వేరే ప్రాంతంలో ఉస్మానియా ఆస్పత్రిని నిర్మిస్తే ఎలా ఉంటుందని కొందరు అంటున్నారు. చంచల్‌గూడ, కొత్తపేట మార్కెట్, గోషామహల్‌లోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ప్రాంతాలను పరిశీలించారు. కానీ.. అందుకు కొందరు అంగీకరించట్లేదు. ఇప్పుడున్న ప్రాంతంలోనే భవనం నిర్మించాలని పట్టుబడుతున్నారు.చిక్కుముడులు విప్పేందుకు కృషి.. కొత్త భవనం నిర్మించేందుకు కృషి చేస్తున్నాం. ఒక అడుగు ముందుకు పడితే రెండడుగులు వెనక్కి అన్నట్టుగా పరిస్థితి ఉంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం కూడా ఎంతో నిబద్ధతతో ముందుకు వెళ్తోంది. కానీ.. చిక్కుముడులు మాత్రం వీడట్లేదు. ఎలాగైనా కొత్త భవనం నిర్మించి రోగులకు మేలైన సేవలు అందించాలనేదే నా కోరిక. – డాక్టర్ బి.నాగేందర్, సూపరింటెండెంట్, ఉస్మానియా ఆస్పత్రిపాత భవనంతో ప్రయోజనం లేదు.. పాత భవనం అలాగే ఉంచితే అసాంఘిక కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉంది. ఆ భవనాన్ని కూల్చేసి కొత్త భవనం నిర్మిస్తే పేద రోగులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. పాత భవనాన్ని చూసుకుంటూ కూర్చుంటే ఏమొస్తుంది. ఎప్పుడు కూలిపోతుందో.. ఎప్పుడేం అవుతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాం. – వి.నర్సింగ్ రావు, జియాగూడ -
ఓ వైపు పగుళ్లు.. మరో వైపు వరద నీరు
-
వర్సిటీలకు కొత్త చట్టం
15 రోజుల్లో రూపకల్పన.. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు గవర్నర్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ హైదరాబాద్: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు కొత్త చట్టం తీసుకువచ్చే అంశంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌తో చర్చించారు. వర్సిటీలకు చాన్సలర్ల నియామకానికి తోడు రాష్ట్రానికి అనుగుణమైన మార్పులు, చేర్పులతో ఈ కొత్త చట్టానికి రూపకల్పన చేస్తున్నామని ఆయనకు తెలిపారు. దీంతోపాటు ఉస్మానియా ఆస్పత్రి భవనం కూల్చివేత, పదో షెడ్యూల్లోని సంస్థల అంశంలో ఏపీ ఫిర్యాదులపైనా వివరణ ఇచ్చారు. మంగళవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలోని యూనివర్సిటీలన్నింటికీ గవర్నర్ గౌరవ హోదాలో చాన్సలర్‌గా కొనసాగుతున్నారు. అయితే రాష్ట్రం ఏర్పడ్డాక వర్సిటీలకు వైస్ చాన్సలర్ల (వీసీల) నియామకాలను ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. ఈ క్రమంలో ఒక్కో యూనివర్సిటీకి ఒక నిపుణుడిని చాన్సలర్‌గా నియమించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకోసం ప్రస్తుతమున్న యూనివర్సిటీల చట్టాన్ని మార్చాల్సి ఉంది. దీంతోపాటు పాలన, అకడమిక్ వ్యవహారాల్లో ఒక్కో వర్సిటీ ఒక్కో విధంగా వ్యవహరిస్తుండడం, ప్రభుత్వానికి వర్సిటీలపై ఆజమాయిషీ లేకుండా పోయిన పరిస్థితులను చక్కదిద్దాలన్న భావనకు వచ్చారు. వీటన్నింటి నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా కొత ్త చట్టానికి రూపకల్పన చేయనున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆచార్య, ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి, న్యాయశాఖ అధికారులు చర్చించారు. 15 రోజుల్లో చట్టాన్ని రూపొందించాలని... వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయానికి వచ్చారు. ఈ పరిణామాలన్నింటినీ భేటీ సందర్భంగా గవర్నర్‌కు సీఎం కేసీఆర్ వివరించారు. దీంతోపాటు పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ఫైన్ ఆర్ట్స్ కాలేజీల్లో అడ్మిషన్లు, తదితర వివాదాలపై తెలంగాణ ప్రభుత్వం వివాదాస్పదంగా వ్యవహరిస్తోందంటూ ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు మంగళవారం మధ్యాహ్నమే గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో... వీటిపై గవర్నర్‌కు సీఎం కేసీఆర్ వివరణ ఇచ్చారు. ఈ సంస్థలన్నీ విభజన చట్టం ప్రకారం పదో షెడ్యూల్లో ఉన్నాయని, వాటి సేవలు కావాలంటే ఏపీ ప్రభుత్వం రాత పూర్వకంగా కోరాల్సి ఉందని, అందుకు అవసరమైన చార్జీలు కూడా చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. ఇక ఉస్మానియా ఆసుపత్రి కూల్చివేత అంశంపైనా గవర్నర్, సీఎం మధ్య చర్చ జరిగింది. చారిత్రక కట్టడమైనప్పటికీ ఉస్మానియా ఆసుపత్రి భవనం కూలిపోయే స్థితిలో ఉందని, అందుకే కూల్చివేయాలనే నిర్ణయించామని.. అదే స్థలంలో అధునాతన ఆసుపత్రి నిర్మిస్తామని గవర్నర్‌కు కేసీఆర్ వివరించారు. సెప్టెంబర్ మొదటి వారంలో ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలన్న నిర్ణయాన్ని కూడా ఆయనకు తెలియబరిచారు. 7న ఢిల్లీకి గవర్నర్.. ఈనెల 7న గవర్నర్ నరసింహన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో విభజనకు సంబంధించి పెం డింగ్‌లో ఉన్న పలు అంశాలను సైతం గవర్నర్‌కు కేసీఆర్ నివేదించారు. ప్రధానంగా హైకోర్టు విభజనను వేగంగా పూర్తి చేయాలని కోరారు. -
‘ఆపరేషన్ ఉస్మానియా’ షురూ
పాత భవనాన్ని కూల్చేందుకు రంగం సిద్ధం దాని స్థానంలోనే ట్విన్‌టవర్స్ నిర్మాణం పర్షియన్ శైలిలో పరిపాలనా భవనం కార్పొరేట్‌కు దీటుగా ఓపీ, ఐపీ బ్లాకులు సిటీబ్యూరో: అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఉస్మానియా జనరల్ ఆస్పత్రి భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో తరచూ పైకప్పు పెచ్చులూడి పడుతుండటంతో రోగులు, సిబ్బంది ఆందోళనకు లోనవుతున్నారు. ఈ నేపథ్యంలో వైద్య సేవలకు ఈ భవనం సురక్షితం కాదని జేఎన్టీయూ ఇంజనీరింగ్ నిపుణులు తేల్చిచెప్పడంతో దానిని నేలమట్టం చేసి, అదే స్థానంలో మరో రెండు బహుల అంతస్తుల భవనాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేగాకుండా పర్షియన్ శైలిలో పరిపాలనా భవనం, ఆపరేషన్ థియేటర్లు, ఇన్‌పేషెంట్ వార్డులు, అవుట్ పేషంట్ విభాగాలను కార్పొరేట్ ఆస్పత్రులకు తీసి పోని స్థాయిలో నిర్మించాలని నిర్ణయించారు. ఈ మేరకు వారసత్వ కట్టడాల జాబితా నుంచి ఉస్మానియాను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పురావస్తు మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. వారం రోజుల్లో ఖాళీ..తరలింపునకు ప్రతిపాదనలు సిద్ధం అన్ని సవ్యంగా జరిగితే వారం రోజుల్లో ఆస్పత్రిని ఖాళీ చేయనున్నట్లు గురువారం ఆస్పత్రిని సందర్శించిన ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ఇందుకుగాను అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. జనరల్ మెడిసిన్, మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, డీవీఎల్ జైల్ వార్డుల్లోని 316 పడకలను ఫీవర్ ఆస్పత్రికి, జనరల్ సర్జరీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, పోస్టు ఓపీవార్డుల్లోని 356 పడకలను నిలోఫర్, మలక్‌పేట్, వనస్థలిపురం ఏరియా ఆస్పత్రులకు, ఆర్థోపెడిక్స్లోని 120 పడకలను కింగ్‌కోఠి ఆస్పత్రికి, న్యూరాలజీ వార్డులోని 46 పడకలను ఫీవర్, గాంధీ ఆస్పత్రులకు తరలించాలని భావిస్తున్నారు. ఆరోగ్యశ్రీవార్డులోని 19 పడకలను ఏరియా ఆస్పత్రికి, నర్సింగ్ స్కూల్‌ను వెంగల్రావునగర్లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్‌కు, డెంటల్ కాలేజీని గాంధీ ఆస్పత్రికి తరలించాలని ప్రతిపాదనలు రూపొందించారు. చారిత్రక నేపథ్యం ఇదీ.. అప్పటికే విదేశాల్లో ప్రాచుర్యంలో ఉన్న వైద్య విధానాలు, బోధనా పద్ధతులను భాగ్యనగరంలో అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో 4వ నిజాం నవాబ్ నసీరుద్దౌలా 1846లో ఆసుపత్రి నిర్మాణానికి సన్నాహాలు చేపట్టారు. ఆ తరువాత 1866లో ‘ఆఫ్జల్‌గంజ్ ఆసుపత్రి’ పేరుతో 5వ నవాబు అఫ్జల్ఉద్లా మూసీ నది ఒడ్డున ఒక చిన్న దవాఖానా కట్టించారు. 1908లో మూసీ వరదల్లో ఆ భవనం నేలమట్టమయ్యింది. దీంతో అప్పటి నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1925లో 27 ఏకరాల విస్తీర్ణంలో ప్రస్తుత ఉస్మానియా ఆసుపత్రి భవనాన్ని నిర్మించారు. అయితే ఆతరువాత పాలకుల నిర్ణక్ష్యం కారణంగా అది శిథిలావస్థకు చేరుకుంది. ఏళ్ల తరబడి పునరుద్ధరణ పనులు చేపట్టకపోవడంతో పెచ్చులూడి పడుతోంది. ఇటీవల పైకప్పు కూలిపడడంతో వైద్యలు గాయపడ్డారు. ఆ తర్వాత వార్డులో విధులు నిర్వహిస్తున్న ఓ నర్సు సహా ఇద్దరు రోగులు తీవ్రంగా గాయపడ్డారు. ఇటీవల జనరల్ సర్జన్ విభాగంలో పైకప్పు కూలిపడడంతో వైద్యులు సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగడమేగాక ఉద్యోగ సంఘాలు సమష్టిగా ఉస్మానియా ఆస్పత్రి పరిరక్షణ కమిటీ పేరుతో జేఏసీ ఏర్పాటు చేశారు. కన్వీనర్ డాక్టర్ బి.నాగేందర్ నేతృత్వంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి సహా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మను కలిసి సమస్యను వివరించారు. మంత్రి లక్ష్మారెడ్డి సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో, అదే సమయంలో భవనంపై అధ్యయనం చేసిన జేఎన్టీయూ ఇంజనీరింగ్ నిపుణులు అది ఏమాత్రం సురక్షితం కాదని స్పష్టం చేశారు. వైఎస్ హయాంలోనే పునాది వాస్తవానికి దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే నూతన భవనం నిర్మించాలని నిర్ణయించారు. నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఏడు అంతస్తుల భవ నాన్ని నిర్మించాలని భావిస్తూ, 2009 లో రూ.5 కోట్లు మంజూరు చేశారు. ఆయన మరణం తర్వాత అధికారంలోకి వ చ్చిన రోశయ్య 2010లో రూ.200 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఆయన రాజీనామా తర్వాత సీఎంగా బాధ్యతలు చేపట్టిన నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి మరో రూ.50కోట్లు కేటాయిస్తూ పైలాన్ కూడా ఏర్పాటు చేశారు. అయితే అందుకు ఆర్కియాలజీ విభాగం అభ్యంతరం చెప్పడంతో ఐదు అంతస్తులకు కుదించారు. తీరా పనులు ప్రారంభించే సమయంలో తాము ఖాళీ చేయబోమంటూ నర్సింగ్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీనికితోడు పురావస్తుశాఖ అభ్యంతరం చె బుతుంటంతో చంచల్‌గూడ జైలు సమీపంలో నిర్మింస్తే ఎలా ఉంటుందనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. అనేక ప్రతిపాదనలు, అడ్డంకులను దాటుకుని ఎట్టకేలకు కొత్త భవనం పనులకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వైద్యులు... 50 మంది ప్రొఫెసర్లు, 50 అసోసియేట్ ప్రొఫెసర్లు, 150 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 200 మంది పీజీలు, 800 ఇంటర్నీలు అందుబాటులో ఉన్నారు. 1975 నుంచి కొత్త నియమకాలు లేవు. సుమారు వంద మంది కాంట్రాక్ట్ ప్రతిపాదిన ప ని చేస్తున్నారు. శానిటేషన్ విభాగంలో 350 మందికిగాను 150 మంది విధులు నిర్వహిస్తున్నారు.