
రమణాగౌడ్
నవీపేట: పెళ్లి విందులో మాంసం ముక్క గొంతులో చిక్కుకుని ఒక వ్యక్తి మృతి చెందాడు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం హనుమాన్ ఫారమ్ శివారులోని ఓ ఫంక్షన్‌లో హాల్‌లో శనివారం జరిగిన ఈ సంఘటన వివరాలివి. నవీపేటకు చెందిన రమణాగౌడ్ (45) పెళ్లి విందులో భోజనం చేస్తుండగా మాంసపు ముక్క గొంతుకు అడ్డుపడి ఊపిరి ఆడక కిందపడిపోయాడు.
బంధువులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు స్పష్టం చేశారు. గ్యాస్ సమస్యతో పాటు హార్ట్ స్ట్రోక్ రావడంతో రమణాగౌడ్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.