Wedding feast
-
ఊపిరి తీసిన మాంసం ముక్క
నవీపేట: పెళ్లి విందులో మాంసం ముక్క గొంతులో చిక్కుకుని ఒక వ్యక్తి మృతి చెందాడు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం హనుమాన్ ఫారమ్ శివారులోని ఓ ఫంక్షన్లో హాల్లో శనివారం జరిగిన ఈ సంఘటన వివరాలివి. నవీపేటకు చెందిన రమణాగౌడ్ (45) పెళ్లి విందులో భోజనం చేస్తుండగా మాంసపు ముక్క గొంతుకు అడ్డుపడి ఊపిరి ఆడక కిందపడిపోయాడు. బంధువులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు స్పష్టం చేశారు. గ్యాస్ సమస్యతో పాటు హార్ట్ స్ట్రోక్ రావడంతో రమణాగౌడ్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. -
పెళ్లి విందు పెట్టలేదని..
సాక్షి, నల్గొండ: పెళ్లి భోజనం పెట్టనందుకు కుల పెద్దలు ఓ కుటుంబానికి రూ. లక్ష జరిమానా విధించి, కులం నుంచి బహిష్కరించారు. జరిమానా చెల్లిస్తేనే కులదైవం గంగదేవమ్మ పండుగలో తమతో కలిసి పాల్గొనే అర్హత ఉంటుందంటూ ఆదేశించడంతో బాధితులు పోలీసులను, మీడియాను ఆశ్రయించారు. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని ఏపీ లింగోటంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన యాదవ కులస్థులు ఉగ్గేపల్లి లక్ష్మయ్య, రాములమ్మ దంపతుల కుమారుడు శ్రీనివాస్ వివాహాన్ని గ్రామంలోనే ఏప్రిల్ 27న జరిపించారు. కరోనా కారణంగా పరిమిత సంఖ్యలో బంధువులను పెళ్లికి ఆహ్వానించారు. ఈ విషయం తెలుసుకున్న కుల పేద్దలు కులస్థులను, గ్రామస్థులకు విందు భోజనం ఏర్పాటు చేయనందుకు ఆగ్రహించారు. గ్రామంలో జరగనున్న కులదైవం గంగదేవమ్మ పండుగకు ఆనవాయితీ ప్రకారం లక్ష్మయ్య కుటుంబం ఇచ్చిన నగదును(పట్టి) నిర్వాహకులు తిరిగి ఇచ్చేశారు. ఇదేంటని ప్రశ్నిస్తే.. కుమారుడి పెళ్లికి విందు ఏర్పాటు చేయనందుకు కుల బహిష్కరణ విధిస్తున్నట్లు చెప్పారు. తమను అవమానించిన కుల పెద్దలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, డీజీపీ, నల్లగొండ కలెక్టర్, ఎస్పీలకు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు. ఇలాంటి ఆధునిక యుగంలో కూడా కుటుంబాలను వేలేస్తూ, విధించిన జరిమానా కట్టాలని వేధిస్తున్న వారిపై చట్టపరమైన చర్య తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. దీంతో స్థానిక నార్కట్ పల్లి పోలీసులు, తహశీల్దార్ దీనిపై గ్రామంలోకి వెళ్లి విచారణ చేపట్టారు. -
మటన్ కోసం పెళ్లి విందులో ఘర్షణ
మటన్ ‘ముక్క’ పెళ్లి విందులో ఉద్రిక్తతకు దారితీసింది. మటన్‌తో భోజనం వడ్డించలేదనే కారణంతో వరుడి తరఫు బంధువులు వధువు బంధువులతో గొడవకు దిగారు. ఈ వివాదం చిలికి చిలికి గాలివానలా మారి పరస్పర దాడులకు దారితీసింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని ఉప్పుసాకలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉప్పుసాకకు చెందిన ఆజ్మీరా కుమారి వివాహం కొత్తగూడేనికి చెందిన లావుడ్యా ప్రవీణ్‌తో శుక్రవారం ఉదయం వధువు ఇంటి వద్ద జరిగింది. వివాహం అనంతరం భోజనాల వద్ద వధువు తరఫువారు మటన్‌తో భోజనం వడ్డించాలని వధువు బంధులతో ఘర్షణకు దిగారు. మటన్ పెట్టే ఆర్థిక స్థోమత లేదని చికెన్‌తో భోజనాలు చేయాలని వధువు తరఫు బంధువులు నచ్చజెప్పేందుకు యత్నించారు. ఈ క్రమంలోనే ఇరువర్గాల మధ్య మాట మాట పెరిగి ఘర్షణ తలెత్తింది. భోజనాలు చేసేందుకు వేసిన కుర్చీలు తీసుకుని ఒకరిపై ఒకరు భౌతికదాడులకు దిగారు. సుమారు వందకుపైగా కుర్చీలు విరిగిపోగా.. ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం ఇరువర్గాల వారు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదులు చేసుకున్నారు. -
మటన్ ‘ముక్క’ కోసం పెళ్లి విందులో ఘర్షణ
-
‘మాంసం’ గొడవ వరుడినే మార్చేసింది..!
ముజాఫర్‌నగర్: పెళ్లి విందులో మాంసాహారం లేదని గొడవకు దిగిన వరుడితో తెగతెంపులు చేసుకుందో వధువు. అయితే అంతలోనే అనూహ్యంగా పెళ్లికి వచ్చిన అతిథి వధువును పెళ్లాడతానని ముందుకొచ్చాడు. ఆమె కూడా సరేననడంతో ఘనంగా పెళ్లి జరిగింది. సినీ తరహాలో జరిగిన ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కుల్హేదీ గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. విందులో మాంసాహారం పెట్టలేదని వరుడు కుటుంబం వధువు కుటుంబంతో వాదనకు దిగింది. మార్కెట్లో మాంసం కొరత ఉందని అందుకే వండలేకపోయామని చెప్పినా వినలేదు. సముదాయించాలని యత్నించినా ఫలితం లేదు. దీంతో విసుగెత్తిన వధువు అసలు పెళ్లే వద్దని తేల్చి చెప్పింది. చివరకు ఆమెను పెళ్లాడతానని ముందుకొచ్చిన వ్యక్తితో ఏడడుగులు నడిచింది. యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని అక్రమ కబేళాలను నిషేధించిన విషయం తెలిసిందే. దీంతో అక్కడ మాంసం కొరత పెరిగింది. ఫలితంగా చికెన్ ధరలను అమాంతం పెంచేశారు. -
విష వంటకాలతో వివాహ విందు
బైలైన్ వివాహ వ్యసవ్థ ప్రవర్థిల్లుతుండటానికి కారణం అద్భుతమైన విడాకుల చట్టాలుండటమేనని బెర్నార్డ్ షా అన్నాడు. ఇంగ్లిష్‌లో షేక్స్పియర్ తర్వాత చక్కటి నాటక రచయితైన షా మన దేశంలో బ్రిటిష్‌వాళ్లు బహదూర్ షా జఫర్‌ను కూలదోయాడానికి ఒక ఏడాది ముందు, 1856లో జన్మించాడు. మనం స్వాతంత్య్రం సాధించుకున్న తర్వాత మూడేళ్లకు 1950లో మరణించాడు. ఆయన చెప్పిన నానుడి 2015 బిహార్ ఎన్నికలకు సరిగ్గా సరిపోతుందంటే ఆయనైతే పగలబడి నవ్వి ఉండేవాడే. షాలోని ఆ ఉద్వేగం అణుచుకోశక్య మైనది కాదు. అలా అని ఆయన ఎన్నడూ బాధ్యతారహితంగానూ ఉండేవాడు కాదు. నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్‌ల పెళ్లి అనేక లక్ష్యాలకు గురిపెట్టినది. కొన్ని పెళ్లిళ్లకు వివాహపూర్వ విడాకుల ఒప్పందం నిబంధన ఉండటమూ అవసరమమేననే షా తరహా సూక్తిని అది ధృవీకరిస్తుంది. ఏమాట కామాటే చెప్పాలి, లాలూ ఎలాంటి భ్రమలకు లోనుకాలేదు. బాధితునికి ఉండాల్సిన ఉద్వేగ మంతటితో ఆయన పెళ్లి విందులో తాను ఆరగించింది విషమంటూ మెల్లగా చెప్పి, పెళ్లి సంబరాలను చప్పగా చల్లార్చారు. నితీష్ రాజకీయాల్లో పూసల్లో దారంలా కనిపించే సారాన్ని గ్రహించగలిగితే ఈ సమస్య మరీ అంత సంక్లిష్టమైనదేమీ కాదు. పెళ్లి ఊరే గింపు ఎక్కడ మొదలవుతుంది, ఎక్కడ ముగుస్తుంది అనేదానిపై పట్టింపేమీ లేదు. కాకపోతే పెళ్లి కొడుకు మాత్రం నితీష్ కుమారే కావాలి లేదా అసలు పెళ్లే లేదు. రాజకీయాల్లో అలాంటి వాదన మనగలగాలంటే క్షేత్రస్థాయి వాస్తవికత అందుకు దోహదం చేసి తీరాలి. సంక్షిప్తంగా ప్రస్తుత బిహార్ చిత్తరువు ఇది: నితీష్ పార్టీ లేని నేత. ఇక లాలూ పార్టీ, గడ్డి కుంభకోణంలోని ఆయనకు పడ్డ శిక్ష పుణ్యమాని నాయకుడు లేని పార్టీ. ఆచరణాత్మక పరి భాషలో చెప్పాలంటే వారి మధ్య ఒప్పందం ఇది: ఓట్లు సంపాదించడం అనే భారీ బరువును మోయడం లాలూ చేయాల్సి ఉంటుంది. కాగా అత్యున్నత పదవి అనే ఊరించే పండును మాత్రం నితీష్ కుమార్ తీసుకుంటారు. అందుకే నితీష్ కుమార్ అనే పెళ్లికొడుకు ఎప్పుడూ ఎక్కడానికి ఎవరి గుర్రం దొరుకుతుందా అని తెగ అన్వేషిస్తుంటారు. ఒంటరిగా, ఆయన ఎక్కడికీ పోలేరు. ఒక దశాబ్దిన్నర పాటూ ఆయన బీజేపీని తన గుర్రంగా వాడుకున్నారు. దాన్నుంచి కలిగే మేలునంతా రాబట్టుకోవడం బాగానే చేశారు. పాట్నాలో ముఖ్యమంత్రి కావడానికి ముందు ఆయన ఢిల్లీలో ఒక ముఖ్య క్యాబినెట్ మంత్రి పదవిని అనుభవించారు. 2013లో లెక్కలు తప్పుగా వేసి 2014 ఎన్నికల తర్వాత తాను ప్రధానమంత్రి కావచ్చని ఆయన భావించారు. తప్పు చేస్తున్నాననే చింత రవ్వంతైనా లేకుండా ఆయన బీజేపీతో హఠాత్తుగా తెగదెంపులు చేసుకున్నారు. బీజేపీని వదిలిపెట్టేయ డానికి నితీష్‌కు పదిహేనేళ్లు పడితే, ఆయన తనను వదిలేయడానికి కేవలం 15 రోజులు చాలని లాలూ ప్రసాద్ యాదవ్‌కు తెలుసు. వాడుకున్నాక తనను తిట్టిపోయడం ఆయన కళ్లకు కనబడుతూనే ఉంది. సుదీర్ఘమైన క్రీడ ఇప్పటికే మొదలైంది. ఇద్దరు ‘‘భాగస్వాములు’’ సీట్ల పంపకంలో తమ ఎమ్మెల్యే అభ్య ర్థుల వాటాను సాధ్యమైనంత ఎక్కువ చేసుకోవడం ద్వారా తమ ప్రయోజ నాలను పరిరక్షించుకోవాలని దృఢ సంకల్పంతో ఉన్నారు. వర్షాకాలపు అడవుల్లోని పొదల్లాంటి తెలివైన చిన్న కథనాలను నాటారు. వాటిలోకెల్లా అత్యంత భావనాత్మకమైన కథనం మాత్రం.. గాలిపోయిన కాంగ్రెస్ కూడా తమ కూటమిలో భాగస్వామి కావాలని ఆశిస్తున్న నితీష్ శిబిరం నుంచి వెలువడింది. ప్రస్తుతం ప్రజాభిప్రాయ సేకరణలు కాంగ్రెస్‌కు రెండు నుంచి ఐదు సీట్లు దక్కవచ్చని భావిస్తున్నాయి. కానీ ఆ పార్టీ దాదాపు 60 వరకు సీట్లలో పోటీ చేయాలని అనుకుంటోంది. దానికివ్వడానికి ఆ సీట్లు ఎక్కడ నుంచి లభిస్తాయి? అవి గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుచుకున్న స్థానాలేనని నితీశ్ శిబిరానికి చెందిన కథకుల అభిప్రాయం. చాలా తెలివైన కథనమే. గత శాసనసభ ఎన్నికల్లో నితీష్ బీజేపీకి మిత్రు డు. మరోవిధంగా చెప్పాలంటే ఐదేళ్ల క్రితం తాను గెలుచుకున్న స్థానాల్లో ఏ ఒక్కదాన్నీ ఆయన వదులుకోవడానికీ సిద్ధంగా లేరు. లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ రెండో స్థానంలో నిలిచిన సీట్లు నిజానికే దానికే దక్కాలి. వాటిని కాంగ్రెస్‌కు వదిలేసే విషయంలో ఆయన మహా ఉదారంగా ఉన్నారు. అనుభవజ్ఞుడైన ఆ యాదవ నేత మూర్ఖుడేమీ కాదనేది స్పష్టమే. ఈ వంటకమంతే నమ్మశక్యంకాని మరో కథనం ప్రకారం ఈ కూటమి మాస్టర్ ప్లాన్ వెనుక ఉన్నది రాహుల్‌గాంధీ అని. వారి ప్రయోజనాలకు ఫలానాది మంచి అని రాహుల్ ఇచ్చే ఆదేశాలను లాలూ, నితీష్లకు పాటిస్తారని నమ్మేది బ్రెయిన్ డెడ్ అయిన వారు మాత్రమే. ఇలాంటి మీడియా వ్యవసా యాన్ని ఎన్నికల సమయం నాటి మీడియా కోర్సుకు సమానమై నదని నా ప్రతిపాదన. మొదట చెప్పిన భాష్యం పాత తప్పునే పునరావృతం చేసింది. ఎన్నికలంటే అంకగణితం కాదు. హాస్యాస్పదమైన కొన్ని లెక్కలు వేస్తున్నారు: జనాభాపరమైన కూడికల ప్రాతి పది కపై ఈ సంఖ్యకు ఆ సంఖ్యను కలపండి, లేదా ఇంత సంఖ్యను ఇక్కడి నుంచి అక్కడికి మార్చండి, సత్వరం! అది అంత సరళ మే అయితే ఎన్నికల కమిషన్ ఓటర్లను కాక గణాంక శాస్త్రవేత్తల ను సంప్రదిస్తుంది. ప్రతి ఎన్నికలు నూతన వాస్తవాల ప్రాతి పదికపైనే జరుగుతాయి. అంతకుమించి కుల విధేయతకు అతీ తంగా ఓటు చేసే వారి శాతం, ప్రత్యేకించి యువతలో పెరుగు తోంది. వారి నిర్ణయమే అంతిమ ఫలితాన్ని నిర్ణయిస్తుంది. సుపరిపాలనకు ముందు షరతైన స్థిరమైన ప్రభుతాన్ని ఎవరు అందిం చగలుగుతారు? అనే అత్యంత మౌలిక ప్రశ్నపైనే వచ్చే బిహార్ ఎన్నికలు ఆధారపడి ఉన్నాయి. దీర్ఘకాలికమైన అస్థిరతకు బిహార్ భారీ మూల్యాన్నే చెల్లించింది. లాలూ యాదవ్‌కు సుస్థిరమైన ప్రజాతీర్పే లభించింది. కానీ ఆయన పరిపాలనను అందించలేకపోయారు. నితీష్ కూల్చే వరకు బీజేపీ, నితీష్‌కుమార్ కూటమి బిహార్‌కు సుస్థిర పాలనను అందించింది. బిహార్ రాజకీయ చిత్రపటం ఎన్నో ఎగుడుదిగుడులను చూసింది. జాతీ య నాయకునిగా నరేంద్రమోదీ ఆవిర్భావం, నితీష్ కుమార్ ఊపిరి ఎగ బోస్తూ, ఎంతో చిత్ర హింసననుభవిస్తూ బద్ధశత్రువైన లాలూ ప్రసాద్‌తో కల వడాన్ని, నితీష్, జీతన్‌రాం మాంజీని గద్దెనెక్కించడం, దించడాన్ని కాంచింది. లాలూ సీఎం ఆశలకు దూరం కావడం, తత్పర్యవసానంగా తన కుటుంబంలోని తర్వాతి తరానికి అధికారాన్ని బదలాయించడం వంటి మార్పులను గమనించింది. ఎన్నో గణనీయమైన ఈ ఎగుడుదిగుడుల తదుపరి ఇవి మొట్టమొదటి ఎన్నికలు కాబోతున్నాయి. అనూహ్యమైన అంశాలు ప్రజాస్వామ్యాన్ని అద్భుతమైన ఉత్కంఠభరితమైన ప్రక్రియను చేస్తాయి. - ఎం.జె. అక్బర్ సీనియర్ సంపాదకులు -
అమ్మాయి కోసం వివాదం: ముగ్గురికి కత్తిపోట్లు
చాంద్రాయణగుట్ట: వివాహ విందులో నెలకొన్న వివాదం చిలికి చిలికి గాలివానలా మారి ముగ్గురి కత్తిపోట్లకు దారి తీసింది. ఛత్రినాక పోలీసుల కథనం ప్రకారం.. చాంద్రాయణగుట్టకు చెందిన అబ్రార్, ఇర్ఫాన్ సమీప బంధువులు. ఇద్దరూ తమ స్నేహితులతో కలిసి ఈనెల 4న బండ్లగూడలో జరిగిన బంధువుల పెళ్లి విందుకు వెళ్లారు. ఆ సమయంలో ఒక అమ్మాయి విషయమై అబ్రార్, ఇర్ఫాన్ గొడవ పడ్డారు. పెద్దలు ఇద్దరినీ సముదాయించి పంపేశారు. ఇదిలా ఉండగా... రాజీ కుదుర్చుకుందామని అబ్రార్ ఆరుగురితో, ఇర్ఫాన్ ఐదుగురితో మంగళవారం రాత్రి జంగమ్మెట్‌లోని బుడగ జంగాల బస్తీకి వచ్చారు. ఆ సమయంలో మాటా మాటా పెరగడంతో ఇర్ఫాన్కత్తితో అబ్రార్‌పై కత్తితో దాడి చేశాడు. దీంతో ఇర్ఫాన్‌తో పాటు వచ్చిన ఫయీం, నదీంలపై అబ్రార్ బృందం కత్తితో దాడి చేసింది. సమాచారం అందుకున్న ఛత్రినాక పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఇరు వర్గాలపై కేసులు నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బగారా బైంగన్
షహర్‌కీ షాన్ సామ్రాజ్య విస్తరణ కాంక్షతో రగులుతున్న ఔరంగజేబు ఢిల్లీ నుంచి హైదరాబాద్ సంస్థానానికి సైన్యాన్ని పంపాడు. పరిస్థితిని సమీక్షించేందుకు ఓ రోజు తెలంగాణ ప్రాంతానికి చేరుకున్నాడు. ఇక్కడి కుతుబ్‌షాహీ పాలకుల ప్రతినిధులు చర్చకు వచ్చారు. ఇంతలో స్థానిక బావర్చీ వచ్చి ఏం వంట వండమంటారో పురమాయించాలని కోరాడు. ‘కిరీటం లేకుండా నేనుండలేను. వంటలోనూ కిరీటం ఉన్నదే కావాలి’ అంటూ ఆదేశించాడట. అంతే షాహీ దస్తర్‌ఖానాలో ఘుమఘుమలాడే బగారా బైంగన్ సిద్ధమైంది. మన దేశంలో హైదరాబాద్, పాకిస్థాన్‌లో సింధ్ ప్రాంతం దీనికి ప్రసిద్ధి. హైదరాబాదీ బిర్యానీ సహజోడీగా ప్రపంచ ఖ్యాతి దీని సొంతం. పర్షియా నుంచి అరువు బిర్యన్ అనే వంటకాన్ని బిర్యానీగా మార్చి ప్రపంచానికి గొప్ప రుచిని అందించిన హైదరాబాదీ పాకయాజీలు బగారా బైంగన్‌ను దానికి జంటగా మార్చి ఆ రుచికి పరిపూర్ణత అందించారు. అప్పట్లో దీని రుచికి ముగ్ధుడైన ఔరంగజేబు నాటి వంటవారికి విలువైన కానుకలు అందించారట. ఆహా ఏమి రుచి.. తెలంగాణ లో జరిగే పెళ్లి విందులో హైదరాబాదీ బిర్యానీ ఉండితీరాల్సిందే.. దానికి సరిజోడిగా బగారా బైంగన్ కొలువుదీరాల్సిందే. కుతుబ్‌షాహీలకు పూర్వం నుంచి.. అంటే హైదరాబాద్ నగర నిర్మాణం కంటే ముందు నుంచే ఇక్కడ ఈ వంకాయ వంటకం స్థిరపడింది. ఆదిలో ఇది ముస్లిం కుటుంబాలకే పరిమితమైన ఈ వంటకం క్రమంగా అందరి నోళ్లలో కరిగిపోయింది. పెళ్లి విందులో ఉండి తీరాల్సిందే... పాత హైదరాబాద్ సంస్థానం పరిధిలో ప్రతి పెళ్లింట బిర్యానీతోకలిసి బగారా బైంగన్ కొలువుదీరటం అతి సాధారణ విషయం. ఉన్నత వంటకంగా సంబోధించటం ఆనవాయితీ. దీంతో పెళ్లిరోజున దాన్ని వడ్డించటాన్ని అతిథులకు గొప్ప మర్యాద చేయటంగా భావిస్తారు. కోస్తాలో బాగా ప్రాచుర్యంలో ఉండే గుత్తి వంకాయ కూరకు దగ్గరి పోలిక ఉండే బగారా బైంగన్లో మసాలా పాళ్లు కాస్త ఎక్కువ. కారం, పులుపుతో ఘాటుగా ఉండే గ్రేవీలో చిన్నగా ఉండే గుండ్రటి వంకాయలు నోరూరిస్తుంటాయి. నాలుగు పక్షాలుగా కోసిన వంకాయలను తొడిమె తొలగించకుండా నూనెలో బాగా వేయించి మసాలా మిశ్రమంలో మునిగేలా ఉంచుతారు. మసాలా చేరిన వంకాయ బిర్యానీతో కలిసి అద్భుత రుచిని నోటికందిస్తుంది. - గౌరీభట్ల నరసింహమూర్తి