మటన్‌ ‘ముక్క’ కోసం పెళ్లి విందులో ఘర్షణ | Fight For Non veg In Marriage Function At Burgampad | Sakshi
Sakshi News home page

మటన్‌ ‘ముక్క’ కోసం పెళ్లి విందులో ఘర్షణ

Published Tue, Feb 26 2019 8:54 AM | Last Updated on Fri, Mar 22 2024 11:16 AM

మటన్‌ ‘ముక్క’ పెళ్లి విందులో ఘర్షణకు దారితీసింది. మటన్‌తో భోజనం వడ్డించలేదనే కారణంతో వరుడి తరఫు బంధువులు వధువు బంధువులతో గొడవకు దిగారు. ఈ వివాదం చిలికి చిలికి గాలివానలా మారి పరస్పర దాడులకు దారితీసింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని ఉప్పుసాకలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉప్పుసాకకు చెందిన ఆజ్మీరా కుమారి వివాహం కొత్తగూడేనికి చెందిన లావుడ్యా ప్రవీణ్‌తో శుక్రవారం ఉదయం వధువు ఇంటి వద్ద జరిగింది.

వివాహం అనంతరం భోజనాల వద్ద వధువు తరఫువారు మటన్‌తో భోజనం వడ్డించాలని వధువు బంధులతో ఘర్షణకు దిగారు. మటన్‌ పెట్టే ఆర్థిక స్థోమత లేదని చికెన్‌తో భోజనాలు  చేయాలని వధువు తరఫు బంధువులు నచ్చజెప్పేందుకు యత్నించారు. ఈ క్రమంలోనే ఇరువర్గాల మధ్య మాట మాట పెరిగి ఉద్రిక్తతకు దారితీసింది. భోజనాలు చేసేందుకు వేసిన కుర్చీలు తీసుకుని ఒకరిపై ఒకరు భౌతికదాడులకు దిగారు. సుమారు వందకుపైగా కుర్చీలు విరిగిపోగా.. ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం ఇరువర్గాల వారు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదులు చేసుకున్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement