దేశ వాణిజ్య రాజధానిలో మాంసం లొల్లి ముదురుతోంది. ఓ పక్క జైనులు పవిత్రంగా భావించే ఆ ఎనిమిది రోజులు మాంసం అమ్మాకాన్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకోగా దానిని శివసేన పార్టీ విమర్శించిన విషయం తెలిసిందే. అయితే, మహారాష్ట్ర నవ నిర్మాణ సేన మాత్రం శివసేన కంటే మరో అడుగు మందుకేసి ఏకంగా మాంసం అమ్మకాలను స్వయంగా గురువారం నుంచి ప్రారంభిస్తున్నట్లు స్పష్టం చేసింది. ముంబయి దాదార్ లోని అగర్ బజార్వద్ద తన పార్టీకి చెందిన కార్యకర్తలతో ప్రత్యేక మాంసం విక్రయ కేంద్రాలను ఏర్పాటుచేయిస్తానని చెప్పింది.