ముజాఫర్‌నగర్: పెళ్లి విందులో మాంసాహారం లేదని గొడవకు దిగిన వరుడితో తెగతెంపులు చేసుకుందో వధువు. అయితే అంతలోనే అనూహ్యంగా పెళ్లికి వచ్చిన అతిథి వధువును పెళ్లాడతానని ముందుకొచ్చాడు. ఆమె కూడా సరేననడంతో ఘనంగా పెళ్లి జరిగింది. సినీ తరహాలో జరిగిన ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కుల్హేదీ గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. విందులో మాంసాహారం పెట్టలేదని వరుడు కుటుంబం వధువు కుటుంబంతో వాదనకు దిగింది.
మార్కెట్‌లో మాంసం కొరత ఉందని అందుకే వండలేకపోయామని చెప్పినా వినలేదు. సముదాయించాలని యత్నించినా ఫలితం లేదు. దీంతో విసుగెత్తిన వధువు అసలు పెళ్లే వద్దని తేల్చి చెప్పింది. చివరకు ఆమెను పెళ్లాడతానని ముందుకొచ్చిన వ్యక్తితో ఏడడుగులు నడిచింది. యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని అక్రమ కబేళాలను నిషేధించిన విషయం తెలిసిందే. దీంతో అక్కడ మాంసం కొరత పెరిగింది. ఫలితంగా చికెన్ ధరలను అమాంతం పెంచేశారు.
‘మాంసం’ గొడవ వరుడినే మార్చేసింది..!
Published Fri, Apr 28 2017 2:31 AM | Last Updated on Tue, Sep 5 2017 9:50 AM
Advertisement
Advertisement