విష వంటకాలతో వివాహ విందు
బైలైన్
వివాహ వ్యసవ్థ ప్రవర్థిల్లుతుండటానికి కారణం అద్భుతమైన విడాకుల చట్టాలుండటమేనని బెర్నార్డ్ షా అన్నాడు. ఇంగ్లిష్‌లో షేక్‌స్పియర్ తర్వాత చక్కటి నాటక రచయితైన షా మన దేశంలో బ్రిటిష్‌వాళ్లు బహదూర్ షా జఫర్‌ను కూలదోయాడానికి ఒక ఏడాది ముందు, 1856లో జన్మించాడు. మనం స్వాతంత్య్రం సాధించుకున్న తర్వాత మూడేళ్లకు 1950లో మరణించాడు. ఆయన చెప్పిన నానుడి 2015 బిహార్ ఎన్నికలకు సరిగ్గా సరిపోతుందంటే ఆయనైతే పగలబడి నవ్వి ఉండేవాడే.
షాలోని ఆ ఉద్వేగం అణుచుకోశక్య మైనది కాదు. అలా అని ఆయన ఎన్నడూ బాధ్యతారహితంగానూ ఉండేవాడు కాదు. నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్‌ల పెళ్లి అనేక లక్ష్యాలకు గురిపెట్టినది. కొన్ని పెళ్లిళ్లకు వివాహపూర్వ విడాకుల ఒప్పందం నిబంధన ఉండటమూ అవసరమమేననే షా తరహా సూక్తిని అది ధృవీకరిస్తుంది. ఏమాట కామాటే చెప్పాలి, లాలూ ఎలాంటి భ్రమలకు లోనుకాలేదు. బాధితునికి ఉండాల్సిన ఉద్వేగ మంతటితో ఆయన పెళ్లి విందులో తాను ఆరగించింది విషమంటూ మెల్లగా చెప్పి, పెళ్లి సంబరాలను చప్పగా చల్లార్చారు.
నితీష్ రాజకీయాల్లో పూసల్లో దారంలా కనిపించే సారాన్ని గ్రహించగలిగితే ఈ సమస్య మరీ అంత సంక్లిష్టమైనదేమీ కాదు. పెళ్లి ఊరే గింపు ఎక్కడ మొదలవుతుంది, ఎక్కడ ముగుస్తుంది అనేదానిపై పట్టింపేమీ లేదు. కాకపోతే పెళ్లి కొడుకు మాత్రం నితీష్ కుమారే కావాలి లేదా అసలు పెళ్లే లేదు. రాజకీయాల్లో అలాంటి వాదన మనగలగాలంటే క్షేత్రస్థాయి వాస్తవికత అందుకు దోహదం చేసి తీరాలి. సంక్షిప్తంగా ప్రస్తుత బిహార్ చిత్తరువు ఇది: నితీష్ పార్టీ లేని నేత.
ఇక లాలూ పార్టీ, గడ్డి కుంభకోణంలోని ఆయనకు పడ్డ శిక్ష పుణ్యమాని నాయకుడు లేని పార్టీ. ఆచరణాత్మక పరి భాషలో చెప్పాలంటే వారి మధ్య ఒప్పందం ఇది: ఓట్లు సంపాదించడం అనే భారీ బరువును మోయడం లాలూ చేయాల్సి ఉంటుంది. కాగా అత్యున్నత పదవి అనే ఊరించే పండును మాత్రం నితీష్ కుమార్ తీసుకుంటారు.
అందుకే నితీష్ కుమార్ అనే పెళ్లికొడుకు ఎప్పుడూ ఎక్కడానికి ఎవరి గుర్రం దొరుకుతుందా అని తెగ అన్వేషిస్తుంటారు. ఒంటరిగా, ఆయన ఎక్కడికీ పోలేరు. ఒక దశాబ్దిన్నర పాటూ ఆయన బీజేపీని తన గుర్రంగా వాడుకున్నారు. దాన్నుంచి కలిగే మేలునంతా రాబట్టుకోవడం బాగానే చేశారు. పాట్నాలో ముఖ్యమంత్రి కావడానికి ముందు ఆయన ఢిల్లీలో ఒక ముఖ్య క్యాబినెట్ మంత్రి పదవిని అనుభవించారు.
2013లో లెక్కలు తప్పుగా వేసి 2014 ఎన్నికల తర్వాత తాను ప్రధానమంత్రి కావచ్చని ఆయన భావించారు. తప్పు చేస్తున్నాననే చింత రవ్వంతైనా లేకుండా ఆయన బీజేపీతో హఠాత్తుగా తెగదెంపులు చేసుకున్నారు. బీజేపీని వదిలిపెట్టేయ డానికి నితీష్‌కు పదిహేనేళ్లు పడితే, ఆయన తనను వదిలేయడానికి కేవలం 15 రోజులు చాలని లాలూ ప్రసాద్ యాదవ్‌కు తెలుసు. వాడుకున్నాక తనను తిట్టిపోయడం ఆయన కళ్లకు కనబడుతూనే ఉంది.
సుదీర్ఘమైన క్రీడ ఇప్పటికే మొదలైంది. ఇద్దరు ‘‘భాగస్వాములు’’ సీట్ల పంపకంలో తమ ఎమ్మెల్యే అభ్య ర్థుల వాటాను సాధ్యమైనంత ఎక్కువ చేసుకోవడం ద్వారా తమ ప్రయోజ నాలను పరిరక్షించుకోవాలని దృఢ సంకల్పంతో ఉన్నారు. వర్షాకాలపు అడవుల్లోని పొదల్లాంటి తెలివైన చిన్న కథనాలను నాటారు. వాటిలోకెల్లా అత్యంత భావనాత్మకమైన కథనం మాత్రం.. గాలిపోయిన కాంగ్రెస్ కూడా తమ కూటమిలో భాగస్వామి కావాలని ఆశిస్తున్న నితీష్ శిబిరం నుంచి వెలువడింది.
ప్రస్తుతం ప్రజాభిప్రాయ సేకరణలు కాంగ్రెస్‌కు రెండు నుంచి ఐదు సీట్లు దక్కవచ్చని భావిస్తున్నాయి. కానీ ఆ పార్టీ దాదాపు 60 వరకు సీట్లలో పోటీ చేయాలని అనుకుంటోంది. దానికివ్వడానికి ఆ సీట్లు ఎక్కడ నుంచి లభిస్తాయి? అవి గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుచుకున్న స్థానాలేనని నితీశ్ శిబిరానికి చెందిన కథకుల అభిప్రాయం.
చాలా తెలివైన కథనమే. గత శాసనసభ ఎన్నికల్లో నితీష్ బీజేపీకి మిత్రు డు. మరోవిధంగా చెప్పాలంటే ఐదేళ్ల క్రితం తాను గెలుచుకున్న స్థానాల్లో ఏ ఒక్కదాన్నీ ఆయన వదులుకోవడానికీ సిద్ధంగా లేరు. లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ రెండో స్థానంలో నిలిచిన సీట్లు నిజానికే దానికే దక్కాలి. వాటిని కాంగ్రెస్‌కు వదిలేసే విషయంలో ఆయన మహా ఉదారంగా ఉన్నారు.
అనుభవజ్ఞుడైన ఆ యాదవ నేత మూర్ఖుడేమీ కాదనేది స్పష్టమే.
ఈ వంటకమంతే నమ్మశక్యంకాని మరో కథనం ప్రకారం ఈ కూటమి మాస్టర్ ప్లాన్ వెనుక ఉన్నది రాహుల్‌గాంధీ అని. వారి ప్రయోజనాలకు ఫలానాది మంచి అని రాహుల్ ఇచ్చే ఆదేశాలను లాలూ, నితీష్‌లకు పాటిస్తారని నమ్మేది బ్రెయిన్ డెడ్ అయిన వారు మాత్రమే. ఇలాంటి మీడియా వ్యవసా యాన్ని ఎన్నికల సమయం నాటి మీడియా కోర్సుకు సమానమై నదని నా ప్రతిపాదన.
మొదట చెప్పిన భాష్యం పాత తప్పునే పునరావృతం చేసింది. ఎన్నికలంటే అంకగణితం కాదు. హాస్యాస్పదమైన కొన్ని లెక్కలు వేస్తున్నారు: జనాభాపరమైన కూడికల ప్రాతి పది కపై ఈ సంఖ్యకు ఆ సంఖ్యను కలపండి, లేదా ఇంత సంఖ్యను ఇక్కడి నుంచి అక్కడికి మార్చండి, సత్వరం! అది అంత సరళ మే అయితే ఎన్నికల కమిషన్ ఓటర్లను కాక గణాంక శాస్త్రవేత్తల ను సంప్రదిస్తుంది. ప్రతి ఎన్నికలు నూతన వాస్తవాల ప్రాతి పదికపైనే జరుగుతాయి. అంతకుమించి కుల విధేయతకు అతీ తంగా ఓటు చేసే వారి శాతం, ప్రత్యేకించి యువతలో పెరుగు తోంది. వారి నిర్ణయమే అంతిమ ఫలితాన్ని నిర్ణయిస్తుంది.
సుపరిపాలనకు ముందు షరతైన స్థిరమైన ప్రభుతాన్ని ఎవరు అందిం చగలుగుతారు? అనే అత్యంత మౌలిక ప్రశ్నపైనే వచ్చే బిహార్ ఎన్నికలు ఆధారపడి ఉన్నాయి. దీర్ఘకాలికమైన అస్థిరతకు బిహార్ భారీ మూల్యాన్నే చెల్లించింది. లాలూ యాదవ్‌కు సుస్థిరమైన ప్రజాతీర్పే లభించింది. కానీ ఆయన పరిపాలనను అందించలేకపోయారు. నితీష్ కూల్చే వరకు బీజేపీ, నితీష్‌కుమార్ కూటమి బిహార్‌కు సుస్థిర పాలనను అందించింది.
బిహార్ రాజకీయ చిత్రపటం ఎన్నో ఎగుడుదిగుడులను చూసింది. జాతీ య నాయకునిగా నరేంద్రమోదీ ఆవిర్భావం, నితీష్ కుమార్ ఊపిరి ఎగ బోస్తూ, ఎంతో చిత్ర హింసననుభవిస్తూ బద్ధశత్రువైన లాలూ ప్రసాద్‌తో కల వడాన్ని, నితీష్, జీతన్‌రాం మాంజీని గద్దెనెక్కించడం, దించడాన్ని కాంచింది. లాలూ సీఎం ఆశలకు దూరం కావడం, తత్పర్యవసానంగా తన కుటుంబంలోని తర్వాతి తరానికి అధికారాన్ని బదలాయించడం వంటి మార్పులను గమనించింది. ఎన్నో గణనీయమైన ఈ ఎగుడుదిగుడుల తదుపరి ఇవి మొట్టమొదటి ఎన్నికలు కాబోతున్నాయి. అనూహ్యమైన అంశాలు ప్రజాస్వామ్యాన్ని అద్భుతమైన ఉత్కంఠభరితమైన ప్రక్రియను చేస్తాయి.
- ఎం.జె. అక్బర్
సీనియర్ సంపాదకులు