సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా జనరల్ ఆస్పత్రిని సందర్శించి.. తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలకు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు. కొందరు హాఫ్ నాలెడ్జ్‌తో మాట్లాడుతున్నారంటూ చురకలంటించారాయన.
రాజ్యాంగ పదవిలో ఉండి కొందరు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు. తెలంగాణ వచ్చాక నిమ్స్‌లో సౌకర్యాలు పెరిగాయ్. కొందరు కళ్లు ఉండి మంచి చూడలేరు.. చెవులు ఉండి మంచి వినలేరు.. మంచి మాటలు మాట్లాడలేరు అంటూ వ్యాఖ్యానించారాయన.
ఉస్మానియా కొత్త బిల్డింగ్ నిర్మాణానికి లీగల్ సమస్యలు ఉన్నాయని హరీష్ రావు తెలిపారు. అవగాహన లేకుండా విమర్శలు చేయడం సరికాదన్నారు. నిమ్స్‌లో గొప్ప గొప్ప డాక్టర్లు పని చేస్తున్నారని, నిమ్స్‌కు ప్రత్యేకంగా కేసీఆర్ ప్రత్యేకంగా రూ. 150 కోట్లు రిలీజ్ చేశారు. ఆస్పత్రిలో 900 నుంచి 1500కి పడక గదులు పెంచాం అని తెలిపారాయన.
కొత్త భవనం నిర్మాణానికి సంబంధించి ఏకాభిప్రాయం అవసరం ఉందని, ఆ సేకరణ నివేదికను హైకోర్టుకు అందిస్తామని, హైకోర్టు నుంచి అనుమతులు రాగానే కొత్త భవనం నిర్మాణం ప్రారంభిస్తామని తెలిపారాయన.
ఇదీ చదవండి: నాది రాజకీయం కాదు
Comments
Please login to add a commentAdd a comment