Ukraine-Russia Crisis: రష్యా-ఉక్రెయిన్‌ల యుద్ధం ప్రపంచంలోని ప్రతీ ఒక్కరిని కదిలిస్తోంది. తమ స్వలాభం కోసం యుద్ధం చేస్తూ ఉక్రెయిన్‌లోని అమాయక ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న రష్యా వైఖరిని తీవ్రంగా తప్పుబడుతున్నారు. క్రీడాలోకం సైతం ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలుస్తూ తమ సంఘీభావాన్ని ప్రకటిస్తున్నారు.
తాజాగా శనివారం ప్రీమియర్ లీగ్‌లో భాగంగా మాంచెస్టర్ సిటీ, ఎవర్టన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఉక్రెయిన్‌కు చెందిన ఒలెక్సాండర్ జించెంకో మాంచెస్టర్ సిటీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మ్యాచ్ మధ్యలో తమ దేశం పరిస్థితి గుర్తుకువచ్చిందేమో.. ఢిఫెండర్ ఒలెక్సాండర్ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యాడు. అతను వెక్కి వెక్కి ఏడ్వడం మ్యాచ్ చూడడానికి వచ్చిన అభిమానులను కలిచివేసింది.
దీంతో రెండు జట్ల అభిమానులు ఆ ఆటగాడికి ఓదార్పునిస్తూ.. సంఘీభావంగా లేచి నిలబడి అతనికి మద్దతిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా మ్యాచ్ ప్రారంభానికి ముందు మాంచెస్టర్ సిటీ ఆటగాళ్లు.. ఉక్రెయిన్‌పై జరుగుతున్న దాడిని నిరసిస్తూ తమ టీషర్ట్‌పై ఉక్రెయిన్ జెండాను ముద్రించుకొని ..'' నో వార్'' అని సంఘీభావం తెలపగా.. మరోవైపు ఎవర్టన్ ఆటగాళ్లు ఉక్రెయిన్ జెండాను కప్పుకొని మద్దతిచ్చారు.
చదవండి: Russia Ukraine War: 'యుద్ధం ఆపేయండి'.. సొంత దేశాన్ని ఏకిపారేసిన టెన్నిస్ స్టార్
Ukrainian footballer Zinchenko brought to tears as Everton and Man City players show support for Ukraine. pic.twitter.com/qxvHoItDxz
— Richard Chambers (@newschambers) February 26, 2022
Comments
Please login to add a commentAdd a comment