రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలై.. రెండు సంవత్సరాలు అవుతోంది. తొలుత ఉక్రెయిన్‌పై భీకర దాడులు చేసి రష్యా ఆధిపత్యం చెలాయించగా.. ఆ తర్వాత ఉక్రెయిన్ పాశ్చాత్య దేశాల సహకారంతో ఎదురుదాడుల్ని పెంచింది. మొదట్లో రష్యా ఆక్రమించిన ఉక్రెయిన్ భూభాగాల్ని ఒక్కొక్కటిగా తిరిగి స్వాధీనం చేసుకుంటోంది. దీంతో రష్యా తన దాడుల్ని మరింత తీవ్రతరం చేసింది. ఉక్రెయిన్‌ని బలహీనపరిచేందుకు ప్రధాన కార్యాలయాలను టార్గెట్ చేసుకొని, డ్రోన్ దాడులకు పాల్పడుతోంది. ఇటు ఉక్రెయిన్ సైతం ఈ దాడుల్ని తిప్పికొడుతోంది.
తాజాగా రష్కా- ఉక్రెయిన్ పోరులో హైదరాబాద్ వాసి మృతి చెందాడు.. ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో రష్యా తరపున పోరాడుతూ నగరానికి చెందిన మహ్మద్ అఫ్సాన్(30) అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని అధికారులు బుధవారం వెల్లడించారు. అయితే ఉద్యోగం విషయంలో మోసపోవడంతో ఆఫ్సాన్ రష్యన్ ఆర్మీలో బలవంతంగా చేరాల్సి వచ్చినట్లు సమాచారం.
కాగా రష్యా సైన్యానికి సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న దాదాపు 20 మంది భారతీయులను తీసుకొచ్చేందుకు తాము ప్రయత్నిస్తున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపిన కొద్ది రోజులకే ఈ విషాదం వెలుగుచూసింది. మరోవైపు మహ్మద్ అస్ఫాన్‌ను రష్యా నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చేందుకు సాయం కోసం అతడి కుటుంబుం ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీని సంప్రదించింది. ఈ క్రమంలో ఎంఐఎం మాస్కోలోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించగా.. అస్ఫాన్ మరణించినట్లు అక్కడి అధికారులు ధృవీకరించారు. మృతిడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
చదవండి: గర్భవతైన భార్యను, కూతురును వదిలి ఇజ్రాయెల్‌కు.. అంతలోనే
Comments
Please login to add a commentAdd a comment