బ్రెన్ : స్విట్జర్లాండ్ దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఇఎఫ్) 2025 వార్షిక సదస్సులో తెలంగాణ ప్రభుత్వం తొలి ఒప్పందం జరిగింది. దావోస్‌లో యూనిలీవర్ సీఈఓ హీన్ షూమేకర్‌తో సీఎం రేవంత్ రెడ్డి బృందం జరిపిన చర్చలు సఫలమయ్యాయి.
వినియోగ వస్తువుల తయారీలో ప్రపంచంలోనే పేరొందిన బ్రాండ్‌లలో ఒకటైన యూనిలీవర్ తెలంగాణలో పెట్టుబడులకు సంసిద్ధత వ్యక్తం చేసిందని చెప్పారు. తెలంగాణలో తయారీ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ప్రపంచ దిగ్గజ సంస్థ యూనిలీవర్ ఒప్పందం కుదుర్చుకుందని అన్నారు. కామారెడ్డి జిల్లాలో పామాయిల్ తయారీ యూనిట్ ఏర్పాటుకు అంగీకరించిందని చెప్పారు. తెలంగాణలో బాటిల్ క్యాప్‌ల తయారీ యూనిట్‌ను నెలకొల్పేందుకు కూడా సంసిద్ధత వ్యక్తం చేసిందని సీఎం రేవంత్ బృందం పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment