కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా సేనలు భీకర దాడులకు పాల్పడుతున్నాయి. తమ దేశంపై రష్యా బలగాలు అర్ధరాత్రి రాకెట్లతో విరుచుకుపడినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ ఆరోపించారు. ప్రముఖంగా విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలే లక్ష్యంగా దాడులు జరిగినట్లు పేర్కొన్నారు. దాని ద్వారానే దేశంలోని చాలా ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయిందన్నారు. పవర్ కట్‌తో కీవ్ సహా చాలా ప్రాంతాలు అంధకారంలోకి వెళ్లాయి.
‘మా దేశంపై ఉగ్రవాద చర్యలను రష్యా తీవ్రతరం చేసింది. రాత్రి మా శత్రుదేశం భారీ స్థాయిలో దాడి చేసింది. 36 రాకెట్లు ప్రయోగించింది. అయితే, అందులో చాలా వరకు కూల్చేశాం. కీలకమైన మౌలిక సదుపాయాలు, ప్రాజెక్టులపై దాడులు చేస్తోంది. ఇవి ఉగ్రవాద వ్యూహాలే.’ అని సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు జెలెన్‌స్కీ.
ఖేర్సన్ నగరాన్ని వీడండి..
రష్యా విలీనం చేసుకున్న ఉక్రెయిన్‌లోని దక్షిణ ప్రాంతం ఖేర్సన్ నగరాన్ని వీడి ప్రజలు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని రష్యా అనుకూల అధికారులు హెచ్చరించారు. ఉక్రెయిన్ ప్రతిదాడులు పెంచిన క్రమంలో ఈ మేరకు హెచ్చరికలు చేసినట్లు తెలుస్తోంది. సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన కారణంగా నగరంలోని ప్రజలంతా నైపెర్ నదికి అవతలివైపు వెళ్లాలని సూచించారు.
ఇదీ చదవండి: ‘బ్రిటన్ ప్రధానిగా బోరిస్ సరైన వ్యక్తి’.. భారత సంతతి ఎంపీ మద్దతు
Comments
Please login to add a commentAdd a comment