'భారత్‌ టాలెంట్‌ అదుర్స్‌.. అవకాశాలకు గొప్ప నిలయం' | India Is A Land Of Opportunity : Manchester CEO | Sakshi
Sakshi News home page

'భారత్‌ టాలెంట్‌ అదుర్స్‌.. అవకాశాలకు గొప్ప నిలయం'

Published Sat, Jan 6 2018 5:06 PM | Last Updated on Tue, Oct 2 2018 8:39 PM

 India Is A Land Of Opportunity : Manchester CEO - Sakshi

సాక్షి, ముంబయి : భారత గొప్ప అవకాశాలకు నిలయం అని మాంచెస్టర్ నగర ఫుట్‌బాట్‌ కప్‌ సీఈవో ఫెర్రాన్‌ సోరియానో అన్నారు. ముఖ్యంగా ఫుట్‌బాల్‌కు ఆధరణ నానాటికి ఇండియాలో పెరుగుతోందని భవిష్యత్‌లో మరింత అభివృద్ధిచెందుతుందన్నారు. శుక్రవారం జంషెడ్‌ పూర్‌, ముంబయికి మధ్య జరిగిన హీరో ఇండియన్‌ సూపర్‌ లీగ్‌(ఐఎస్‌ఎల్‌) ఫుట్‌బాల్‌ కప్‌ మ్యాచ్‌ను స్వయంగా తిలకించేందుకు వచ్చిన ఆయన భారత్‌లో ఫుట్‌బాల్‌ క్రీడకు పెరుగుతున్న క్రేజ్‌పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

భారత్‌లో ఫుట్‌బాల్‌ మార్కెట్‌ మరింత పెరుగుతుందనడంలో తనకు ఏ మాత్రం సందేహం లేదని, చాలా సానుకూల పరిస్థితులు ఇక్కడ ఉన్నాయన్నారు. 'ఫుట్‌బాల్‌కు భారత్‌ గొప్ప అవకాశ నిలయం అని మేం భావిస్తున్నాం. ఇక్కడ ఎంతో టాలెంట్‌, ప్యాషన్‌ ఉన్నవాళ్లున్నారు. భారత్‌లో ఫుట్‌బాల్‌ అభివృద్ధిపై మేం చాలా సానుకూలంగా ఉన్నాం. అందుకే మేం ఈ రోజు ఇక్కడ ఉన్నాం. ఇక్కడ కొన్ని ఐఎస్‌ఎల్‌ మ్యాచ్‌లను చూడాలని, ప్రజలను కలుసుకోవాలని క్రీడాకారులను చూడాలని అనుకుంటున్నాం' అని ఆయన అన్నారు. ఫెర్రాన్‌ మాంచెస్టర్‌ సిటీ ఫుట్‌బాల్‌ కప్‌ సీఈవో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు ఆరు ఫుట్‌బాల్‌ క్లబ్బులు కూడా ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement