‘డ్రా’తో మొదలైన ఐఎస్‌ఎల్‌ | ISL started with a draw | Sakshi
Sakshi News home page

‘డ్రా’తో మొదలైన ఐఎస్‌ఎల్‌

Published Sat, Sep 14 2024 3:51 AM | Last Updated on Sat, Sep 14 2024 3:51 AM

ISL started with a draw

కోల్‌కతా: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) 11వ సీజన్‌ ‘డ్రా’తో ప్రారంభమైంది. గత ఏడాది ఫైనలిస్ట్‌లు ముంబై సిటీ ఫుట్‌బాల్‌ క్లబ్, మోహన్‌ బగాన్‌ సూపర్‌ జెయింట్‌ మధ్య జరిగిన తొలి మ్యాచ్‌ 2–2 గోల్స్‌తో సమంగా ముగిసింది. 

ముంబై సిటీ తరఫున థేర్‌ క్రూమ్‌ 90వ నిమిషంలో గోల్‌ సాధించాడు. మోహన్‌ బగాన్‌ తరఫున తిరి 70వ నిమిషంలో, ఆల్బర్టో రోడ్రిగ్వెజ్‌ 28వ నిమిషంలో గోల్స్‌ కొట్టారు. అయితే మ్యాచ్‌ ఆరంభంలోనే 9వ నిమిషంలో తిరి సెల్ఫ్‌ గోల్‌ చేయడం తుది ఫలితం సమంగా ముగిసేందుకు కారణమైంది. 

సొంత మైదానంలో భారీ సంఖ్యలో ప్రేక్షకుల మధ్య మోహన్‌ బగాన్‌ మ్యాచ్‌ ఆద్యంతం దూకుడు ప్రదర్శించినా... ఈ టీమ్‌ను నిలువరించడంలో ముంబై సఫలమైంది. ఐఎస్‌ఎల్‌లో భాగంగా నేడు రెండు వేర్వేరు వేదికల్లో రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. భువనేశ్వర్‌లో ఒడిషా ఎఫ్‌సీతో చెన్నైయిన్‌ ఎఫ్‌సీ... బెంగళూరులో ఈస్ట్‌ బెంగాల్‌ ఎఫ్‌సీతో బెంగళూరు ఎఫ్‌సీ తలపడతాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement