పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో తన గర్ల్‌ఫ్రెండ్ నుంచి ఖరీదైన గిఫ్ట్‌ను బహుమతిగా అందుకున్నాడు. ఫిబ్రవరి 5న రొనాల్డో పుట్టినరోజు పురస్కరించుకొని రొనాల్డో గర్ల్‌ఫ్రెండ్ జార్జినా రోడ్రిగేజ్ రూ.1.2 కోట్ల విలువైన బ్లాక్ కాడిల్లాక్ ఎస్‌యూవీ మోడల్ కారును గిఫ్ట్‌గా అందించింది. గర్ల్‌ఫ్రెండ్ కారు ఇచ్చిన మరుక్షణమే రొనాల్డో అదే కారులో మాంచెస్టర్ యునైటెడ్ గ్రౌండ్‌కు వెళ్లాడు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి.
ఇందుకు సంబంధించిన వీడియోనూ జార్జినా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. నా జీవితంలో ముఖ్యమైన వ్యక్తి 37వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. కార్లంటే పిచ్చి ఉన్న వ్యక్తికి ఒక మంచి గిఫ్ట్‌ను ఇవ్వడం సంతోషం కలిగించింది. నాకు ఒక మంచి భర్తను.. పిల్లలకు మంచి తండ్రిని రొనాల్డో రూపంలో అందించినందుకు దేవుడికి మనస్పూర్తిగా కృతజ్ఞతలు. రొనాల్డోను మించిన పర్‌ఫెక్షనిస్ట్ మరొకరు లేరు. తనే నాకు ఆదర్శం అంటూ ఎమెషనల్‌గా రాసుకొచ్చింది. కాగా సోషల్ మీడియా యాప్ ఇన్‌స్టాగ్రామ్‌లో రొనాల్డో ఫాలోవర్ల సంఖ్య 400 మిలియన్ల మార్క్‌ను టచ్ చేసిన సంగతి తెలిసిందే. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన తొలి వ్యక్తిగా రొనాల్డో రికార్డులెక్కాడు.
చదవండి: Cristiano Ronaldo: రొనాల్డో అరుదైన ఘనత.. సోషల్ మీడియాను వదల్లేదు
Comments
Please login to add a commentAdd a comment