ఫుట్‌బాల్ స్టార్ కరీమ్ బెంజెమా పురుషుల విభాగంలో ప్రతిష్టాత్మక బాలన్ డీ ఓర్ అవార్డును గెలుచుకున్నాడు. భారత కాలమాన ప్రకారం సోమవారం అర్థరాత్రి పారిస్ వేదికగా జరిగిన వేడుకలో బెంజెమా ఈ అవార్డు అందున్నాడు. 1998లో ఫ్రాన్స్ ఫుట్‌బాల్ దిగ్గజం జినదిన్ జిదానే బాలన్ డీ ఓర్ అవార్డును అందుకోగా.. ఆ తర్వాత ఈ అవార్డు అందుకున్న రెండో ఫ్రాన్స్ ఫుట్‌బాలర్‌గా కరీమ్ బెంజెమా రికార్డులకెక్కాడు. ఈ ఏడాది రియల్ మాడ్రిడ్ తరపున అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన బెంజెమాకు అవార్డు రావడం అతని అభిమానులను సంతోషంలో ముంచెత్తింది.
ఈ ఏడాది మాడ్రిడ్ తరపున 46 మ్యాచ్‌ల్లో 44 గోల్స్ స్కోర్ చేశాడు. ఇందులో 15 గోల్స్ చాంపియన్స్ లీగ్‌లో చేయడం విశేషం. అంతేకాదు రియల్ మాడ్రిడ్ చాంపియన్స్ లీగ్, లాలిగా టైటిల్స్ గెలవడంలో బెంజెమా కీలకపాత్ర పోషించాడు. ఇక చాంపియన్స్ లీగ్‌లో భాగంగా రౌండ్ ఆఫ్ 16లో పారిస్ సెయింట్ జర్మన్‌తో జరిగిన మ్యాచ్‌లో 17 నిమిషాల వ్యవధిలో హ్యాట్రిక్ గోల్స్‌తో మెరిశాడు.
అవార్డు అందుకోవడంపై బెంజెమా స్పందించాడు. ''బాలన్ డీ ఓర్ అవార్డు రావడం గర్వకారణం. అవార్డు అందుకోవడానికి అన్ని విధాలుగా కష్టపడ్డాను.. ఎప్పుడు ఓడిపోవడానికి సిద్ధపడలేదు. నా జీవితంలో ఇద్దరు రోల్ మోడల్స్ ఉన్నారు. ఒకరు జినదిన్ జిదానే.. మరొకరు రొనాల్డో. వారి ప్రభావం నాపై స్పష్టంగా ఉంది. ఫ్రాన్స్ జట్టుకు లేని సందర్భాల్లో చాలా కష్టపడాల్సి వచ్చింది. ఫుట్‌బాల్‌ను మాత్రం ఎంజాయ్ చేస్తూనే ఉంటాను. ఈ అవార్డు రావడం వెనుకు ఎంతో కష్టం ఉంది. అందుకు గర్వంగా ఉంది.'' అంటూ ముగించాడు.
ఇక మహిళల విభాగంలో బార్సిలోనాకు ఆడుతున్న అలెక్సియా పుటెల్లాస్ వరుసగా రెండోసారి అవార్డును నిలబెట్టుకుంది. ఇక కోపా అవార్డును బార్సిలోనాకు చెందిన బార్సిలోనాకు చెందిన గవి సొంతం చేసుకున్నాడు. గెర్డ్ ముల్లర్ అవార్డును బార్సిలోనాకు ఆడుతున్న రాబర్ట్ లెవాన్‌డోస్కీ కైవసం చేసుకోగా.. రియల్ మాడ్రిడ్‌కు చెందిన తిబుట్ కోర్టొయిస్‌ను యషిన్ ట్రోఫీ.. సోక్రెట్స్ అవార్డును సాడియో మానీ(లివర్‌పూల్) సొంతం చేసుకున్నారు. ఇక క్లబ్ ఆఫ్ ది ఇయర్ అవార్డును మాంచెస్టర్ సిటీ గెలుచుకుంది.
🏅 ¡ENHORABUENA, @Benzema! 🏅#ballondor pic.twitter.com/2RuoJE3ZN5
— Real Madrid C.F. (@realmadrid) October 17, 2022
Comments
Please login to add a commentAdd a comment