
∙ సాగర తీరాన యోగా , తాప్సీ
డ్యాన్స్, ఫైట్స్.. ఇలా దర్శకుడు ఏది చెబితే అది చేసేయాలి యాక్టర్స్. అలా దర్శకుడు చెప్పిన మాట చెప్పినట్టు చేయాలంటే, శరీరం మనం చెప్పిన మాట వినాలి. అంటే యాక్టర్స్ ఎప్పుడూ ఫిట్‌గా ఉండాలి. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే.. యుద్ధానికి సిద్ధమైన విల్లులా ఉండాలని తాప్సీని చూస్తే అర్థం అవుతోంది. రీసెంట్‌గా బార్సిలోనాకి చిన్న ట్రిప్ వెళ్లారు తాప్సీ. అక్కడి బీచ్ ఒడ్డున సేద తీరుతూ.. ఇలా హరివిల్లులా పోజ్ ఇస్తూ ఫొటోలు దిగారు.
గ్లామరస్‌గా ఉంటూనే ఫిట్‌నెస్ గోల్స్ పెంచుతున్న తాప్సీని చూస్తే ఎవ్వరైనా సరే ‘విల్లులా.. హరివిల్లులా’ ఉంది అనకుండా ఉండలేరు. బార్సిలోనా వెకేషన్ గురించి తాప్సీ చెబుతూ – ‘‘డియర్ బార్సిలోనా. పర్ఫెక్ట్ బీచ్‌లు, పర్ఫెక్ట్ నీరు, పర్ఫెక్ట్ హోటల్స్, పర్ఫెక్ట్ ఫుడ్.. ఒక్కటేంటి అన్నీ పర్ఫెక్ట్‌గా ఉన్నాయి. ఇలా అన్నీ పర్ఫెక్ట్‌గా కుదిరాయి.. నిజమేనా? అని ఫీల్ అయ్యే లోపలే వర్షం వచ్చేసింది. ఏం ఫర్వాలేదు.. ఈసారి వచ్చేప్పుడు మంచి వాతావరణాన్ని తీసుకొస్తా. అప్పటి వరకూ టాటా. కచ్చితంగా విజిట్ చేయాల్సిన సిటీ బార్సిలోనా’’ అని పేర్కొన్నారు తాప్సీ.
Comments
Please login to add a commentAdd a comment