హువావే ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌ | Huawe Introduced  Folding phone, the Mate X | Sakshi
Sakshi News home page

హువావే ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌

Published Mon, Feb 25 2019 7:14 PM | Last Updated on Mon, Feb 25 2019 7:34 PM

Huawe Introduced  Folding phone, the Mate X - Sakshi

మొబైల్ వ‌ర‌ల్డ్ కాంగ్రెస్ (ఎండ‌బ్ల్యూసీ) 2019 లోటెక్‌  దిగ్గజాలు అద్భుతమైన స్మార్ట్‌ఫోన్లను పరిచయం  చేస్తున్నాయి. ముఖ్యంగా 5జీ, ఫోల‍్డబుల్‌ స్మార్ట్‌ఫోన్లపై  దృష్టిపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో చైనా  మొబైల్స్ త‌యారీదారు హువావే త‌న తొలి ఫోల్డ‌బుల్ స్మార్ట్‌ఫోన్  మేట్ ఎక్స్ ను   పరిచయం చేసింది.  స్పెయిన్ లోని బార్సిలోనాలో జ‌రుగుతున్న ప్ర‌దర్శ‌న‌లో  ఫోల్డబుల్‌  ఫోన్‌ ‘మేట్‌ ఎక్స్‌ ’ను హువావే లాంచ్ చేసింది.

6.6 ఇంచుల డిస్‌ప్లేను ముందు భాగంలో, 6.38 ఇంచుల డిస్ ప్లేను వెనుక భాగంలో అమ‌ర్చారు. ఈ రెండింటినీ మ‌డ‌త తీసిన‌ప్పుడు 8 అంగుళాల  డిస్‌ప్లేతో బిగ్‌ ట్యాబ్‌లా ఉంటుంది.  5జీ సపోర్టు, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్. ట్రిపుల్‌ రియర​ కెమెరా, ఎన్ఎం కార్డు స్లాట్‌ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. అంతేకాదు  55 వాట్ల సూపర్ చార్జ్ ఫీచ‌ర్‌తో  ప్ర‌పంచంలో ఈ ఫీచ‌ర్ తో వ‌చ్చిన ఫోన్ ఇదేనని హువావే వెల్లడించింది.  అలాగే తమ పవర్‌ ఫుల్‌  ప్రాససర్‌ కారణంగా 1 గిగా బైట్‌  మూవీని కేవలం మూడు  సెకన్లలో  డౌన్‌లోడ్‌  చేసుకోవచ్చని కంపెనీ చెబుతోంది. 

ధర : ఈ ఫోన్ ధ‌రను 2607 డాల‌ర్లు (దాదాపుగా రూ.1,85,220) గా నిర్ణ‌యించారు. 2019 మధ్య నాటికి అందుబాటులోకి రానుంది. మరోవైపు ఇటీవల లాంచ్‌ చేసిన శాంసంగ్‌  ఫోల్డబుల్‌ డివైస్‌ శాంసంగ్‌ ఫోల్డ్‌ స్మార్ట్‌ఫోన్‌కు గట్టిపోటీ ఇస్తుందని  అంచనా. 


హువావే మేట్ ఎక్స్ ఫీచ‌ర్లు
6.6 ఇంచ్ ఓలెడ్ డిస్‌ప్లే
2480 x 1148 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌
6.38 ఇంచ్ సెకండ‌రీ ఓలెడ్‌ డిస్‌ప్లే 2480 x 892 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌
ఆండ్రాయిడ్ 9.0 పై
హువావే కైరిన్ 980 ప్రాసెస‌ర్‌
5జీ/8జీబీ ర్యామ్, 256 జీబీ  స్టోరేజ్‌,
512 జీబీఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌,
40 +16 + 8 ఎంపీ ట్రిపుల్ రియర్‌ కెమెరాలు
4500 ఎంఏహెచ్ బ్యాట‌రీ, 55 వాట్ల సూప‌ర్ చార్జ్‌. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement