
పారిస్: బార్సిలోనా ఫుట్‌బాల్ క్లబ్‌ను వీడిన అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లయెనల్ మెస్సీ ఇక ఫ్రాన్స్ ఫుట్‌బాల్ టోర్నీ లీగ్–1లో కనిపించనున్నాడు. ఈ మేరకు అతడు ఫ్రెంచ్ క్లబ్ పారిస్ సెయింట్ జెర్మయిన్ (పీఎస్‌జీ)తో రెండేళ్ల ఒప్పందం కుదుర్చుకున్నాడు. రెండేళ్ల కాలానికి మెస్సీకి దాదాపు 7 కోట్ల యూరోలు (రూ. 610 కోట్లు) చెల్లించనున్నట్లు సమాచారం. మెస్సీ ఒప్పందానికి సంబంధించి నేడు అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
కాగా ఆర్థికపరమైన ఇబ్బందుల వల్ల మెస్సీతో కాంట్రాక్ట్ రెన్యువల్ చేసుకునేందుకు సుముఖంగా లేమని బార్సిలోనా ఫుట్‌బాల్ క్లబ్ గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఆకస్మిక ప్రకటన నేపథ్యంలో అభిమానులు షాక్‌కు గురయ్యారు. ప్రతిష్టాత్మక కోపా అమెరికా 2021లో అర్జెంటీనా విజయం తర్వాత సెలవుల్లో ఉన్న మెస్సీ.. క్లబ్‌లో చేరిన మరుసటి రోజే ఈ మేరకు ప్రకటన జారీకావడం గమనార్హం. మెస్సీతో బార్సిలోనా క్లబ్.. కాంట్రాక్ట్ రెన్యువల్ ఉండొచ్చని భావించగా ఈ హఠాత్పరిణామంతో ఫ్యాన్స్ విస్మయానికి గురయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment