
Lionel Messi.. సెలబ్రిటీలు ఏం చేసినా దానిని ఒక వార్తగా చూడడం ఈ మధ్య బాగా అలవాటైపోయింది. లేచినా.. పడుకున్నా.. తిన్నా.. ఇలా ఏది చేసినా దాన్ని ప్రత్యేకంగా చూస్తుంటారు. ఇంకొందరు మరింత ముందుకెళ్లి సెలబ్రిటీలు వాడిన వస్తువులను ఆన్‌లైన్‌లో వేలం వేయడం చూస్తుంటాం. ఎంతైనా ఒక సెలబ్రిటీ కాబట్టి దానికి మంచి ధర పలికే అవకాశం ఉంటుంది. తాజాగా అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనల్ మెస్సీ ఈ జాబితాలో చేరిపోయాడు.
ఇటీవలే కాంట్రాక్ట్ పొడిగింపులో వచ్చిన సమస్యల వల్ల మెస్సీ స్పానిష్ ఫుట్‌బాల్ క్లబ్ బార్సిలోనాకు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. గత ఆదివారం(ఆగస్టు 8న) జరిగిన ఫేర్‌వెల్ వేడుకలో తన అనుభవాలను పంచుకుంటూ కాస్త ఎమోషనల్ అయ్యాడు. ఈ సందర్భంగా మెస్సీ ఒక టిష్యూ పేపర్‌తో ఉబికి వస్తున్న కన్నీళ్లతో పాటు ముక్కును తుడుచుకున్నాడు. సాధారణంగా వాడేసిన టిష్యూ పేపర్‌కు విలువ ఉండదు. ఇక్కడ టిష్యూను వాడింది మెస్సీ.. ఇంకేముంది అతను వాడిన టిష్యూ పేపర్‌ను తీసుకొని ఒక ప్రబుద్ధుడు ఇంటర్నేషనల్ ఈ-కామర్స్ ఫ్లాట్‌ఫాం ఎమ్‌ఈకెడో లో వేలానికి పెట్టాడు. అయితే ఫుట్‌బాల్ దిగ్గజం కన్నీళ్లు తుడిచిన ఆ టిష్యూ పేపర్‌కు సదరు వ్యక్తి ఫిక్స్ చేసిన ధర ఎంతో తెలుసా.. అక్షరాల రూ. ఏడున్నర కోట్లు ( 1 మిలియన్ డాలర్లు). ఇంకేముంది ఇది తెలుసుకున్న అభిమానులు ''వార్ని.. మెస్సీ వాడి పడేసిన టిష్యూ పేపర్‌కు ఇంత ధర'' అంటూ నోరు వెళ్లబెట్టారు.
13 ఏళ్ల వయసులో 2000 సంవత్సరంలో బార్సిలోనాతో మొదలైన మెస్సీ ప్రయాణం దాదాపు రెండు దశాబ్దాల పాటు సాగింది. 17 సీజన్ల పాటు బార్సిలోనాతోనే ఉన్న మెస్సీ.. ఆ క్లబ్ తరఫున అత్యధిక మ్యాచ్‌లు, అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. బార్సిలోనా క్లబ్‌ను వీడిన మెస్సీ తాజాగా పారిస్ సెయింట్ జర్మన్ ఫుట్‌బాల్ క్లబ్ (పీఎస్‌జీ)కి ఆడనున్నాడు. ఈ మేరకు అతడు ఫ్రెంచ్ క్లబ్ పారిస్ సెయింట్ జెర్మయిన్ (పీఎస్‌జీ)తో రెండేళ్ల ఒప్పందం కుదుర్చుకున్నాడు. రెండేళ్ల కాలానికి మెస్సీకి దాదాపు 7 కోట్ల యూరోలు (రూ. 610 కోట్లు) చెల్లించనున్నట్లు సమాచారం.
we cant take this man 😭💔
— MaayoNᴮᵉᵃˢᵗ😎🎩💫 (@itz_satheesh4) August 8, 2021
The #GOAT🐐 crying 😭 #MESSI pic.twitter.com/bqNVPcjKmq
Comments
Please login to add a commentAdd a comment