tissue paper
-
అయ్యో! ఎంత కష్టం, ఆఫీసుకు టాయిలెట్ పేపర్లు తెస్తున్న ట్విటర్ ఉద్యోగులు
ఎలాన్ మస్క్ ట్విట్టర్ సీఈవోగా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి అందులో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా సంస్థ నష్టాలను తగ్గించే క్రమంలో భారీ స్థాయిలో ఉద్యోగుల తొలగింపు తీవ్ర దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. వీటితో పాటు మస్క్ తీసుకుంటున్న పలు నిర్ణయాలను చూసి కొందరు నిపుణుల సైతం షాక్‌కి గురవుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా టెస్లా అధినేత "క్రేజీ కాస్ట్ కటింగ్" చర్యలను చేపట్టారు. న్యూయార్క్ టైమ్స్ తెలిపిన నివేదిక ప్రకారం.. శాన్ ఫ్రాన్సిస్కోలోనిని ట్విటర్ ప్రధాన కార్యాలయంలో ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగులు తమ సొంత టాయిలెట్ పేపర్‌ను ఆఫీసుకు తీసుకురావడం ప్రారంభించారట. కారణం ఏంటంటే.. ట్విటర్ నిర్వహణ ఖర్చులు తగ్గించే పనిలో ఉన్న మస్క్ భారీగా ఉద్యోగుల తొలగింపు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆ సంస్థలోని క్లీనింగ్ స్టాఫ్‌ను కూడా తొలగించారట. దీంతో బాత్రూంలో నిర్వహణ లేక ఉద్యోగులే వారి ఇటి నుంచి టాయిలెట్ పేపర్లు తీసుకువెళ్లాల్సి వస్తోందట. అధిక వేతనాల కోసం క్లీనింగ్ సిబ్బంది సమ్మె చేయడంతో లేఆఫ్‌ల ప్రక్రియ అందులోనూ జరిగాయి. చదవండి: ఐఫోన్ లవర్స్‌కు శుభవార్త ..‘ఫోల్డ్’పై యాపిల్ కన్ను, శాంసంగ్‌కు ధీటుగా -
మెస్సీ కన్నీళ్లు తుడిచిన టిష్యూ పేపర్ ధర రూ. ఏడున్నర కోట్లు
Lionel Messi.. సెలబ్రిటీలు ఏం చేసినా దానిని ఒక వార్తగా చూడడం ఈ మధ్య బాగా అలవాటైపోయింది. లేచినా.. పడుకున్నా.. తిన్నా.. ఇలా ఏది చేసినా దాన్ని ప్రత్యేకంగా చూస్తుంటారు. ఇంకొందరు మరింత ముందుకెళ్లి సెలబ్రిటీలు వాడిన వస్తువులను ఆన్లైన్లో వేలం వేయడం చూస్తుంటాం. ఎంతైనా ఒక సెలబ్రిటీ కాబట్టి దానికి మంచి ధర పలికే అవకాశం ఉంటుంది. తాజాగా అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనల్ మెస్సీ ఈ జాబితాలో చేరిపోయాడు. ఇటీవలే కాంట్రాక్ట్ పొడిగింపులో వచ్చిన సమస్యల వల్ల మెస్సీ స్పానిష్ ఫుట్‌బాల్ క్లబ్ బార్సిలోనాకు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. గత ఆదివారం(ఆగస్టు 8న) జరిగిన ఫేర్వెల్ వేడుకలో తన అనుభవాలను పంచుకుంటూ కాస్త ఎమోషనల్ అయ్యాడు. ఈ సందర్భంగా మెస్సీ ఒక టిష్యూ పేపర్‌తో ఉబికి వస్తున్న కన్నీళ్లతో పాటు ముక్కును తుడుచుకున్నాడు. సాధారణంగా వాడేసిన టిష్యూ పేపర్‌కు విలువ ఉండదు. ఇక్కడ టిష్యూను వాడింది మెస్సీ.. ఇంకేముంది అతను వాడిన టిష్యూ పేపర్‌ను తీసుకొని ఒక ప్రబుద్ధుడు ఇంటర్నేషనల్ ఈ-కామర్స్ ఫ్లాట్‌ఫాం ఎమ్‌ఈకెడో లో వేలానికి పెట్టాడు. అయితే ఫుట్‌బాల్ దిగ్గజం కన్నీళ్లు తుడిచిన ఆ టిష్యూ పేపర్‌కు సదరు వ్యక్తి ఫిక్స్ చేసిన ధర ఎంతో తెలుసా.. అక్షరాల రూ. ఏడున్నర కోట్లు ( 1 మిలియన్ డాలర్లు). ఇంకేముంది ఇది తెలుసుకున్న అభిమానులు ''వార్ని.. మెస్సీ వాడి పడేసిన టిష్యూ పేపర్‌కు ఇంత ధర'' అంటూ నోరు వెళ్లబెట్టారు. 13 ఏళ్ల వయసులో 2000 సంవత్సరంలో బార్సిలోనాతో మొదలైన మెస్సీ ప్రయాణం దాదాపు రెండు దశాబ్దాల పాటు సాగింది. 17 సీజన్ల పాటు బార్సిలోనాతోనే ఉన్న మెస్సీ.. ఆ క్లబ్ తరఫున అత్యధిక మ్యాచ్‌లు, అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. బార్సిలోనా క్లబ్‌ను వీడిన మెస్సీ తాజాగా పారిస్ సెయింట్ జర్మన్ ఫుట్‌బాల్ క్లబ్ (పీఎస్జీ)కి ఆడనున్నాడు. ఈ మేరకు అతడు ఫ్రెంచ్ క్లబ్ పారిస్ సెయింట్ జెర్మయిన్ (పీఎస్జీ)తో రెండేళ్ల ఒప్పందం కుదుర్చుకున్నాడు. రెండేళ్ల కాలానికి మెస్సీకి దాదాపు 7 కోట్ల యూరోలు (రూ. 610 కోట్లు) చెల్లించనున్నట్లు సమాచారం. we cant take this man 😭💔 The #GOAT🐐 crying 😭 #MESSI pic.twitter.com/bqNVPcjKmq — MaayoNᴮᵉᵃˢᵗ😎🎩💫 (@itz_satheesh4) August 8, 2021 -
టాయిలెట్ పేపర్‌గా కరెన్సీ!
సాక్షి, బిజినెస్ డెస్క్: గతేడాది రూపాయికి కొనుక్కున్న వస్తువు ఈ ఏడాది ఏకంగా 10 లక్షల రూపాయలకు కొనుక్కోవాల్సి వస్తే? అదీ కాదు.. కాసేపటి క్రితం 5 రూపాయలకు కొన్న బిస్కెట్ ప్యాకెట్‌ని 10 నిమిషాల తర్వాత 10 రూపాయలకి.. ఆ తర్వాత మరో 10 నిమిషాలకు ఇరవై, ముప్ఫై, నలభై రూపాయలకు కొనుక్కోవాల్సి వస్తే.. ప్రస్తుతం ఆర్థిక, సామాజిక, రాజకీయ సంక్షోభాలతో అస్తవ్యస్తమైన వెనెజులా దేశంలో అచ్చం ఇలాంటి పరిస్థితే ఉంది. కరెన్సీ విలువ పడిపోవడం, ఆహారం మొదలైన నిత్యావసరాల కొరత నెలకొనడం, దానికి తగ్గట్లుగా రేట్లు పెరిగిపోవడం దీనికి కారణం. దీంతో ఒక దశలో టాయ్‌లెట్ పేపర్‌ను కొనుక్కోవడం బదులు కరెన్సీ నోట్లనే టాయ్‌లెట్ పేపర్‌గా వాడుకుంటున్నారంటే పరిస్థితులు ఎంతగా దిగజారాయో అర్థం చేసుకోవచ్చు. ఎందుకిలా అంటే.. క్రూడాయిల్ ధరలు పడిపోవడంతో ఆ దేశ కరెన్సీ బొలివర్కూ డిమాండ్ విపరీతంగా పడిపోయింది. విదేశాల నుంచి చేసుకునే దిగుమతుల భారం పెరిగి, దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం కావడంతో ప్రభుత్వం మరింత ఎక్కువగా కరెన్సీని ముద్రించింది. దీంతో అందరి చేతుల్లో డబ్బు ఉన్నా, నిత్యావసరాల సరఫరా పరిమితంగా ఉండటంతో వాటి రేట్లు పెరిగిపోయాయి. చివరికి ఇదో ఇదో విషవలయంలా తయారైంది. ఇది గాక, దాచుకున్న డబ్బును వెనెజులన్లు అమెరికన్ డాలర్లలోకి మార్చుకోవడం మొదలెట్టారు. దీంతో డాలర్లకు డిమాండ్ పెరిగి.. వెనెజులా బొలివర్ మారకం రేటు మరింతగా పడిపోయింది. ప్రభుత్వం నియంత్రణ విధించడంతో బ్లాక్ మార్కెట్ జోరందుకుంది. అధికారిక మారకం రేటుకు.. బ్లాక్‌మార్కెట్ రేటుకూ భారీ వ్యత్యాసాలు వచ్చేయడంతో వెనెజులా కరెన్సీ విలువ మరీ పాతాళానికి పడిపోయింది. ఆహారం దగ్గర్నుంచి ప్రతీ దానికి కొరత నెలకొనడంతో సుమారు 30 లక్షల మంది వెనెజులన్లు (జనాభాలో దాదాపు పది శాతం) దేశం విడిచి వెళ్లిపోయారు. కిలో టమాటా... 30,000పైమాటే.. లీటరు పాలు... దాదాపు.. 50,000 ► 10 లక్షల శాతం: ఈ ఏడాది ఆఖరుకు వెనెజులాలో ద్రవ్యోల్బణం చేరబోయే స్థాయి (ఐఎంఎఫ్ అంచనా). ► ప్రభుత్వం పాత కరెన్సీ బొలివర్ ఫుర్టె స్థానంలో బొలివర్ సోబ్రానో కరెన్సీని ప్రవేశపెట్టింది. ఒక సోబ్రానో.. లక్ష ఫుర్టెలకు సమానం. ► ప్రస్తుతం 1 వెనెజులా బొలివర్ సొబ్రానో .. భారత కరెన్సీలో సుమారు రూ. 6.88కి సమానం. ► కిలో టమాటా దాదాపు 4,411 బొలివర్లు.. అంటే రూ.30,387 అన్నమాట. లీటరు పాలప్యాకెట్ ధర సుమారు 7,029 బొలివర్లు (రూ.48,400). -
అండర్వేర్లో టిష్యూ పేపర్లు!
బ్యాటింగ్ కొనసాగించిన సచిన్ న్యూఢిల్లీ: విరేచనాల కారణంగా అండర్వేర్లో టిష్యూ పేపర్లు పెట్టుకొని బ్యాటింగ్ చేయాల్సి వచ్చిందని దిగ్గజ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ వెల్లడించాడు. 2003 ఐసీసీ ప్రపంచకప్ సూపర్ సిక్స్ దశలో శ్రీలంకతో మ్యాచ్ సందర్భంగా ఈ సంఘటన జరిగిందని చెప్పాడు. ఆనాడు ఎదురైన వ్యక్తిగత అనుభవాన్ని మాస్టర్ తన ఆత్మకథ ‘ప్లేయింగ్ ఇట్ మై వే’లో పొందుపర్చాడు. ‘ఓ పక్క లంకతో మ్యాచ్. మరోపక్క నాకేమో కడుపులో తిప్పడం మొదలైంది. డీహైడ్రేషన్ జరుగుతుందనిపిస్తోంది. పాకిస్థాన్‌తో మ్యాచ్ అప్పుడే ఇది మొదలైంది. దాన్నుంచి కోలుకోకముందే ఈ మ్యాచ్ ఆడాల్సి వచ్చింది. దీంతో ఎక్కువ మొత్తంలో ఐసోటోనిక్ డ్రింక్స్ తీసుకున్నా. తొందరగా కోలుకోవాలనే ఉద్దేశంతో శక్తినిచ్చే డ్రింక్స్‌లో టీ స్పూన్ ఉప్పు కలుపుకుని తాగా. కానీ ఫలితం తారుమారైంది. కడుపులో ఒక్కటే కలవరం. పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. కానీ ఏం చేస్తా! తప్పనిసరి స్థితిలో అండర్వేర్లో టిష్యూ పేపర్లు పెట్టుకుని బ్యాటింగ్‌కు దిగా. డ్రింక్స్ విరామాల్లో డ్రెస్సింగ్ రూమ్‌కు పరుగెత్తడం, వాటిని సరిచేసుకొని వచ్చి బ్యాటింగ్ చేయడం. మ్యాచ్ మధ్యలో అయితే చాలా ఇబ్బందిగా అనిపించింది’ అని సచిన్ తెలిపాడు. ఈ ఉదంతాన్ని పక్కనబెడితే ఆ మ్యాచ్‌లో మాస్టర్ 120 బంతుల్లో 97 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. ఓవైపు కడుపులో తిప్పుతుంటే బ్యాటింగ్ చేయడం సరైందికాకపోయినా... చాలా ఓర్పుతో దాన్ని కొనసాగించానన్నాడు. అందుకు తగ్గ ఫలితం దక్కినందుకు సంతోషాన్ని వ్యక్తం చేశాడు.