అభిమానిని రక్తం వచ్చేలా కొట్టిన స్టార్ | Justin Bieber 'PUNCHES male fan in the face and leaves him bloodied' in new violent outburst after arriving at his concert | Sakshi
Sakshi News home page

అభిమానిని రక్తం వచ్చేలా కొట్టిన స్టార్

Published Wed, Nov 23 2016 9:19 AM | Last Updated on Mon, Sep 4 2017 8:55 PM

అభిమానిని రక్తం వచ్చేలా కొట్టిన స్టార్

అభిమానిని రక్తం వచ్చేలా కొట్టిన స్టార్

జస్టిన్ బీబర్ యువతను ఉర్రూతలూగించే పాప్ స్టార్. గత కొద్ది కాలంగా పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన బీబర్ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. బార్సిలోనాలో షో చేయడానికి వెళ్లిన బీబర్ తనను తాకడానికి యత్నించిన అభిమాని ముఖం పగులగొట్టాడు. కారులో షో కోసం బయల్దేరి వెళ్తున్న బీబర్ ను చూసిన ఓ అభిమాని దాన్ని వెంబడించి ఆయన్ను తాకబోయాడు.
 
చిర్రెత్తుకొచ్చిన బీబర్ సదరు అభిమాని ముఖంపై పిడిగుద్దు విసిరాడు. దీంతో ఆ అభిమానితో పాటు రోడ్డు పక్కనే బీబర్ కోసం నిల్చున్నవారు షాక్ కు గురయ్యారు. బీబర్ విసిరిన పంచ్ అభిమాని పెదాలకు బలంగా తాకడంతో అతని నోటి నుంచి రక్తం కారింది. కాగా ఈ సంఘటన మొత్తాన్ని అక్కడ ఉన్న మీడియా చిత్రించింది. 2014లో నటుడు ఓర్లాండోతో కూడా బీబర్ కొట్లాటకు దిగాడు.
 
ఘటనపై బీబర్ ప్రతినిధిని సంప్రదించగా.. షోకు వెళ్లే ముందు అభిమానులతో బీబర్ మాట్లాడినట్లు చెప్పారు. ఫోటో, ఆటోగ్రాఫ్ ల కోసం అభిమానులు కోరగా.. అవి తనకు నచ్చవని బీబర్ చెప్పినట్లు పేర్కొన్నారు. అభిమానులు బీబర్ మాటలు వినకపోవడంతో అక్కడినుంచి బయల్దేరగా ఓ అభిమాని కారును వెంబడించినట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement