
యాక్టర్‌గా దేశవ్యాప్తంగా ఫిదా చేశారు ధనుష్. స్టేట్ అవార్డులు తన సొంతం చేసుకున్నారు. గత ఏడాది ‘ది ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్’ అనే ఇంగ్లీష్ సినిమాలో కూడా కనిపించారు. రాజస్థాన్‌లోని ఓ ఫకీర్ ప్యారిస్ ఎలా వెళ్లాడు? అతని ఈ జర్నీలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమా మంచి విజయం సాధించడమే కాకుండా చాలా మంది మనసులు గెలుచుకుంది. లేటెస్ట్‌గా ఓ అవార్డు కూడా గెలుచుకుంది. ఇటీవల జరిగిన బార్సిలోనా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బెస్ట్ కామెడీ ఫిల్మ్ విభాగంలో ‘ది ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్’ ఎంపికైంది. ఫకీర్ చేసిన ఈ ఫన్నీ జర్నీ జ్యూరీకు కూడా నచ్చడంతో ‘బెస్ట్ కామెడీ ఫిల్మ్’గా అవార్డు గెలుచుకుంది.
Comments
Please login to add a commentAdd a comment