
ప్రముఖ మాజీ ఫుట్ బాల్ క్రీడాకారుడు, పుట్‌బాట్ క్లబ్ బార్సిలోనా లెజెండ్ జేవి హెర్నాండెజ్ కరోనా బారినపడ్డారు. తనకు కోవిడ్-19 పాజిటివ్ వచ్చిందని స్పెయిన్ స్టార్, మాజీ మిడ్ ఫీల్డర్ జేవీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌లో పెట్టారు. అదృష్టవశాత్తూ తాను బాగానే ఉన్నాననీ, కానీ ప్రోటోకాల్ ప్రకారం క్వారంటైన్‌లో ఉన్నట్టు వెల్లడించారు. ఆరోగ్య పరిస్థితి చక్కబడిన తరువాత, అధికారుల అనుమతితో మాత్రమే తిరిగి తను విధుల్లోకి చేరతానని ఖతార్ స్టార్స్ లీగ్ జట్టు అల్ సాద్ ప్రస్తుత మేనేజర్ జేవీ ప్రకటించారు. తాను కోలుకునేవరకు రిజర్వ్ కోచ్ డేవిడ్ ప్రాట్స్ తన స్థానంలో బాధ్యతలను స్వీకరిస్తారని వెల్లడించారు.
కాగా 40 ఏళ్ల అతను తన ఫుట్‌బాల్ ఆట కెరీర్‌లో చివరి నాలుగు సంవత్సరాలు క్లబ్‌లో గడిపాడు. అనంతరం బార్సిలోనాను విడిచిపెట్టి 2015లో క్లబ్‌లో చేరాడు. చాలా పరిణామాల తరువాత ఈ నెల (జూలై 5న) ఖతార్ స్టార్స్ లీగ్ జట్టు మేనేజర్‌గా బాధ్యతలు చేపట్టాడు. 2021జూన్ వరకు ఈ పదవిలో కొనసాగనున్నాడు. ఇంతలోనే ఆయన కరోనా బారిపడటంతో ఈ వారాంతంలో అల్ ఖోర్‌తో అల్‌సద్ ఆడనున్న తదుపరి ఆటకు హాజరు కాలేకపోవచ్చని భావిస్తున్నారు. మరోవైపు కోవిడ్-19 మహమ్మారి కారణంగా మార్చిలో ఖతార్ స్టార్స్ లీగ్ (క్యూఎస్‌ఎల్) శుక్రవారం తిరిగి ప్రారంభమైంది.
Comments
Please login to add a commentAdd a comment