
స్పెయిన్‌లోని బార్సిలోనాలో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (ఎండబ్ల్యూసీ) అట్టహాసంగా ప్రారంభమైంది. ఫిబ్రవరి 25నుంచి 28వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఈ ఇందులో భాగంగా పలు ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు తమ తమ నూతన స్మార్ట్‌ఫోన్లు, ఇతర ఉత్పత్తులను ప్రదర్శించనున్నాయి. ఈ సందర్భంగా శాంసంగ్, ఎల్‌జీ, మైక్రోసాఫ్ట్, షావోమి, హెచ్‌ఎండీ గ్లోబల్, హువావే లాంటి కంపెనీలు తమ అద్భుతమైన స్మార్ట్‌ఫోన్ల ప్రదర‍్శనకు పోటీ పడుతున్నాయి.
ముఖ్యంగా ఎండబ్ల్యూసీ 2019 షోలో శాంసంగ్‌కు పోటీగా హువావే ఫోల్డబుల్ ఫోన్‌ను ఆవిష్కరించింది. ఇంకా ఎల్‌జీ జీ8 థింక్యూ, వన్ ప్లస్ 5జీ స్మార్ట్‌ఫోన్లను ప్రదర్శించింది. అలాగే హెచ్ఎండీ గ్లోబల్ నోకియా 9 ప్యూర్ వ్యూను, 8.1 ప్లస్‌ను, సోనీ ఎక్స్‌పీరియా 1, 10, 10 ప్లస్ , ఎల్3 ఫోన్లను, బ్లాక్‌బెర్రీ కీ 2 రెడ్ ఎడిషన్‌ను పరిచయం చేసింది



Comments
Please login to add a commentAdd a comment