సోనీ ఎక్స్‌పీరియా 1 : సరికొత్త టెక్నాలజీతో | Sony Xperia 1 with Triple Rear Camera Launched at MWC 2019  | Sakshi
Sakshi News home page

సోనీ ఎక్స్‌పీరియా 1 : సరికొత్త టెక్నాలజీతో

Published Mon, Feb 25 2019 6:43 PM | Last Updated on Mon, Feb 25 2019 6:47 PM

Sony Xperia 1 with Triple Rear Camera  Launched at MWC 2019  - Sakshi


ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ సంస్థ సోనీ   సరికొత్త టెక్నాలజీ , అద్భుతమైన ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్ను తాజాగా విడుదల చేసింది.  సోనీ ఎక్స్‌ పీరియా  1ను  స్పెయిన్ లోని  బార్సిలోనాలో జ‌రుగుతున్న మొబైల్ వ‌ర‌ల్డ్ కాంగ్రెస్ (ఎండ‌బ్ల్యూసీ) 2019 ప్ర‌దర్శ‌న‌లో  లాంచ్‌ చేసింది.  ప్రపంచంలోనే తొలిసారి ఐ ఫోటో ఫోకస్‌ టెక్నాలజీతో తీసుకొచ్చినట్టు కంపెనీ వెల్లడించింది.  దీని ధరను  అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ సుమారు రూ. 74200గా ఉంటుందని అంచనా.  బ్లాక్‌, పర్పుల్‌, గ్రే, వైట్‌ కలర్స్‌లో లభ్యం.

దీంతోపాటు  ఎక్స్‌ పీరియా ఎక్స్‌ జెడ్‌ 3 కి కొనసాగింపుగా  ఎక్స్‌ జెడ్‌ 4 స్మార్ట్‌ఫోన్‌ , ఎక్స్‌పీరియా 10,  ఎక్స్‌పీరియా 10 ప్లస్‌ను కూడా   పరిచయం చేసింది. 
  

సోనీ ఎక్స్‌పీరియా 1 ఫీచర్లు
6.5 అంగుళాల  4కె   డిస్‌ప్లే
1644×3840  పిక్సెల్స్‌ రిజల్యూషన్‌ 
ఆండ్రాయిడ్‌ 9.0 పై
6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ 
512 జీబీ దాకా విస్తరించుకునే అవకాశం
12+12+12 ట్రిపుల్‌ రియర్‌ కెమెరా
8 ఎంపీ సెల్ఫీ కెమెరా
3300 ఎంఏహెచ్‌ బ్యాటరీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement