sony xperia
-
ఐఫోన్‌కు పోటీగా సోనీ నుంచి అదిరిపోయే స్మార్ట్‌ఫోన్..! అది కూడా బడ్జెట్ రేంజ్లో
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ప్రీమియం స్మార్ట్ఫోన్లలో బడ్టెట్ రేంజ్లో ఐఫోన్ ఎస్ఈ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఐతే ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌కు చెక్ పెట్టే పనిలో ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం సోనీ నిమ్నగ్నమైంది. న్యూ ఐఫోన్ ఎస్ఈ స్మార్ట్‌ఫోన్‌కు పోటీగా Sony Xperia Ace III స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సోనీ సన్నాహాలను చేస్తోంది. తాజాగా Sony Xperia Ace III సంబంధించిన ఫీచర్స్ ఆన్లైన్లో వైరల్‌గా మారాయి. సోనీ ఎక్స్‌పీరియా ఎస్ సిరీస్ స్మార్ట్ఫోన్లను 2019లో సోనీ లాంచ్ చేసింది. ప్రముఖ టిప్‌స్టర్ హెమ్మెర్స్టోఫర్ , జోల్లేజ్ షేర్ చేసిన రెండర్స్ ప్రకారం...సోనీ ఎక్స్‌పీరియా ఎస్ III వాటర్ డ్రాప్ స్టైల్ నాచ్‌తో 5.5 అంగుళాల డిస్ప్లేతో రానుంది. ఫింగర్ ప్రింట్ స్కానర్, 13 మెగా పిక్సెల్ రియర్ కెమెరాను కల్గి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ లేత ఆకుపచ్చ,బ్లాక్ కలర్ వేరియంట్లలో లభించనుంది. సోనీ ఎక్స్‌పీరియా ఎస్ III స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 888 ఎస్ఓసీ చిప్‌తో రానున్నట్లు సమాచారం. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను పొందనుంది. యూఎస్బీ టైప్‌సీ ఛార్జింగ్ సపోర్ట్, 4500 ఎమ్ఎహెచ్ బ్యాటరీతో రానున్నట్లు టిప్‌స్టర్స్ తమ రెండర్స్లో పేర్కొన్నారు. ఇక ధర విషయానికి వస్తే..కొత్తగా లాంచైన ఐఫోన్ ఎస్ఈ స్మార్ట్‌ఫోన్ ధర సుమారు రూ. 33 వేలుగా ఉండగా..దీని కంటే తక్కువ ధరలో సోనీ ఎక్స్‌పీరియా ఎస్ III వచ్చే అవకాశం ఉందని టిప్‌స్టర్స్ అభిప్రాయపడ్డారు. చదవండి: అనూహ్య నిర్ణయం! అక్కడ ఏటీఎంలు అన్నీ బంద్..! కారణం ఇదే..! -
సోనీ ఎక్స్‌పీరియా 1 : సరికొత్త టెక్నాలజీతో
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ సోనీ సరికొత్త టెక్నాలజీ , అద్భుతమైన ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ను తాజాగా విడుదల చేసింది. సోనీ ఎక్స్ పీరియా 1ను స్పెయిన్ లోని బార్సిలోనాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (ఎండబ్ల్యూసీ) 2019 ప్రదర్శనలో లాంచ్ చేసింది. ప్రపంచంలోనే తొలిసారి ఐ ఫోటో ఫోకస్ టెక్నాలజీతో తీసుకొచ్చినట్టు కంపెనీ వెల్లడించింది. దీని ధరను అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ సుమారు రూ. 74200గా ఉంటుందని అంచనా. బ్లాక్, పర్పుల్, గ్రే, వైట్ కలర్స్‌లో లభ్యం. దీంతోపాటు ఎక్స్ పీరియా ఎక్స్ జెడ్ 3 కి కొనసాగింపుగా ఎక్స్ జెడ్ 4 స్మార్ట్‌ఫోన్ , ఎక్స్‌పీరియా 10, ఎక్స్‌పీరియా 10 ప్లస్‌ను కూడా పరిచయం చేసింది. సోనీ ఎక్స్‌పీరియా 1 ఫీచర్లు 6.5 అంగుళాల 4కె డిస్ప్లే 1644×3840 పిక్సెల్స్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 9.0 పై 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ 512 జీబీ దాకా విస్తరించుకునే అవకాశం 12+12+12 ట్రిపుల్ రియర్ కెమెరా 8 ఎంపీ సెల్ఫీ కెమెరా 3300 ఎంఏహెచ్ బ్యాటరీ -
సోనీ కొత్త ఫోన్.. ఫీచర్లు అదుర్స్!
సోనీ కంపెనీ తాజాగా తన ఎక్స్‌పీరియా శ్రేణిలో అత్యంత ఉత్తమమైన ఫోన్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ ఫోన్ బాడీని అల్యూమినియం, గ్లాస్‌లతో తయారు చేశారు. వాటర్, డస్ట్ రెసిస్టెంట్ లాంటి ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. ఎక్స్‌పీరియా శ్రేణికి చెందిన ఫోన్ల ఫీచర్లు పేపర్ మీద బాగున్నా.. పనితనంలో మాత్రం అంతంతమాత్రమేననే మాటలు మార్కెట్లో వచ్చాయి. అయితే ఆ మాటలకు తెరదించడానికి ఎక్స్జెడ్ను సోనీ మార్కెట్లోకి తెచ్చినట్లు తెలిసింది. ఈ ఏప్రిల్‌లో అందుబాటులోకి రానున్న ఈ మొబైల్ ఫీచర్లు ఓ సారి చూద్దాం. ఎక్స్‌పీరియా ఎక్స్జెడ్ ఫీచర్లు: ప్రైమరీ కెమెరా: 19 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా: 13 మెగాపిక్సల్ తొలిసారి స్లో మోషన్ వీడియా రికార్డింగ్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు కంపెనీ తన అధికారిక వీడియోలో పేర్కొంది. ర్యామ్: 4జీబీ ఇంటర్నల్ స్టోరేజ్: 64 జీబీ (256 జీబీ వరకూ పెంచుకోవచ్చు) బ్యాటరీ: 3230 ఎంఏహెచ్ బ్లూటూత్: 5.0 ధర: రూ.46,700(అంచనా మాత్రమే) -
స్పెషల్ ఫీచర్స్ తో సోనీ సరికొత్త ఫోన్
టోక్యో : ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ సోనీ, తన మొబైల్ సిరీస్ ఎక్స్‌పీరియా ఎక్స్ సిరీస్‌లో తొలి ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేస్తోంది. సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్ఏ అల్ట్రా పేరుతో ఉన్న ఫోన్‌ని సంస్థ తన గ్లోబల్ వెబ్సైట్లో పొందుపరిచింది. అయితే దాని ధర, ఏయే దేశాల్లో అందుబాటులోకి రానుంది తదితర విషయాల్ని మాత్రం వెల్లడించలేదు. త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. ఆయా మార్కెట్లలో లాంచ్ అనంతరం ధరలు రీవీల్ చేసే అవకాశం ఉన్నట్టు తెలస్తోంది. 190 గ్రాముల బరువు తో బ్లాక్, వైట్, గోల్డ్ కలర్స్ ఫోన్ మార్కెట్లో లభ్యంకానుంది. అలాగే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఆటో ఫోకస్,హెచ్ డీ ఫోటో ఫీచర్స్ తోఉన్న 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 21.5 మెగాపిక్సెల్ రియర్ కెమేరా ప్రధాన ఆకర్షణ కానుంది. అలాగే 200 జీబీ ఎక్స్ పాండబుల్ మొమరీ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనుంది. ఎక్స్ ఏ అల్ట్రా ఫీచర్లు ఇలా ఉన్నాయి.. 6 అంగుళాల హెచ్డీ స్ర్కీన్ 1080x1920 పిక్సెల్స్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో ఆపరేటింగ్ సిస్టం 3జీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ మెమొరీ 200 జీబీ ఎక్స్ పాండబుల్ మెమొరీ 21.5 మెగాపిక్సెల్ రియర్ కెమేరా, ఎల్ఈడీ ఫ్లాష్ 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమేరా , ఫ్రంట్ ఫ్లాష్ 2700 ఎంఏహెచ్ బ్యాటరీ