సోనీ కొత్త ఫోన్.. ఫీచర్లు అదుర్స్!
సోనీ కొత్త ఫోన్.. ఫీచర్లు అదుర్స్!
Published Mon, Feb 27 2017 7:36 PM | Last Updated on Tue, Sep 5 2017 4:46 AM
సోనీ కంపెనీ తాజాగా తన ఎక్స్‌పీరియా శ్రేణిలో అత్యంత ఉత్తమమైన ఫోన్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ ఫోన్ బాడీని అల్యూమినియం, గ్లాస్‌లతో తయారు చేశారు. వాటర్, డస్ట్ రెసిస్టెంట్ లాంటి ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. ఎక్స్‌పీరియా శ్రేణికి చెందిన ఫోన్ల ఫీచర్లు పేపర్ మీద బాగున్నా.. పనితనంలో మాత్రం అంతంతమాత్రమేననే మాటలు మార్కెట్లో వచ్చాయి. అయితే ఆ మాటలకు తెరదించడానికి ఎక్స్‌జెడ్‌ను సోనీ మార్కెట్లోకి తెచ్చినట్లు తెలిసింది. ఈ ఏప్రిల్‌లో అందుబాటులోకి రానున్న ఈ మొబైల్ ఫీచర్లు ఓ సారి చూద్దాం.
ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్ ఫీచర్లు:
ప్రైమరీ కెమెరా: 19 మెగాపిక్సల్
ఫ్రంట్ కెమెరా: 13 మెగాపిక్సల్
తొలిసారి స్లో మోషన్ వీడియా రికార్డింగ్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు కంపెనీ తన అధికారిక వీడియోలో పేర్కొంది.
ర్యామ్: 4జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 64 జీబీ (256 జీబీ వరకూ పెంచుకోవచ్చు)
బ్యాటరీ: 3230 ఎంఏహెచ్
బ్లూటూత్: 5.0
ధర: రూ.46,700(అంచనా మాత్రమే)
Advertisement
Advertisement