స్పెషల్ ఫీచర్స్ తో సోనీ సరికొత్త ఫోన్ | Sony Xperia XA Ultra With 6-Inch Display Launched | Sakshi
Sakshi News home page

స్పెషల్ ఫీచర్స్ తో సోనీ సరికొత్త ఫోన్

Published Tue, May 17 2016 3:34 PM | Last Updated on Mon, Sep 4 2017 12:18 AM

స్పెషల్ ఫీచర్స్ తో  సోనీ  సరికొత్త ఫోన్

స్పెషల్ ఫీచర్స్ తో సోనీ సరికొత్త ఫోన్

టోక్యో : ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ సోనీ, తన మొబైల్ సిరీస్ ఎక్స్‌పీరియా ఎక్స్‌ సిరీస్‌లో తొలి ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేస్తోంది. సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్‌ఏ అల్ట్రా పేరుతో ఉన్న ఫోన్‌ని సంస్థ తన గ్లోబల్‌ వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. అయితే దాని ధర, ఏయే దేశాల్లో అందుబాటులోకి రానుంది తదితర విషయాల్ని మాత్రం వెల్లడించలేదు. త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ఈ ఫోన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి.   ఆయా మార్కెట్లలో లాంచ్ అనంతరం ధరలు రీవీల్ చేసే అవకాశం ఉన్నట్టు తెలస్తోంది.  190 గ్రాముల బరువు తో బ్లాక్, వైట్, గోల్డ్  కలర్స్ ఫోన్‌ మార్కెట్లో లభ్యంకానుంది. అలాగే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఆటో ఫోకస్,హెచ్ డీ ఫోటో ఫీచర్స్ తోఉన్న 16 మెగాపిక్సెల్  ఫ్రంట్ కెమెరా,  21.5 మెగాపిక్సెల్‌ రియర్‌ కెమేరా ప్రధాన ఆకర్షణ కానుంది. అలాగే 200 జీబీ ఎక్స్ పాండబుల్ మొమరీ  స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనుంది.


ఎక్స్‌ ఏ అల్ట్రా  ఫీచర్లు ఇలా ఉన్నాయి..
 6 అంగుళాల  హెచ్‌డీ  స్ర్కీన్  
 1080x1920 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
 ఆండ్రాయిడ్‌ 6.0 మార్ష్‌మాలో ఆపరేటింగ్‌ సిస్టం
 3జీ ర్యామ్‌, 16 జీబీ ఇంటర్నల్  మెమొరీ
200 జీబీ ఎక్స్ పాండబుల్  మెమొరీ
 21.5 మెగాపిక్సెల్‌ రియర్‌ కెమేరా, ఎల్‌ఈడీ ఫ్లాష్‌
 16 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమేరా , ఫ్రంట్‌ ఫ్లాష్‌
2700 ఎంఏహెచ్‌ బ్యాటరీ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement