ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్లలో బడ్టెట్ రేంజ్‌లో ఐఫోన్ ఎస్‌ఈ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఐతే ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌కు చెక్ పెట్టే పనిలో ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం సోనీ నిమ్నగ్నమైంది. న్యూ ఐఫోన్ ఎస్‌ఈ స్మార్ట్‌ఫోన్‌కు పోటీగా Sony Xperia Ace III స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సోనీ సన్నాహాలను చేస్తోంది. తాజాగా Sony Xperia Ace III సంబంధించిన ఫీచర్స్ ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారాయి.
సోనీ ఎక్స్‌పీరియా ఎస్ సిరీస్ స్మార్ట్‌ఫోన్లను 2019లో సోనీ లాంచ్ చేసింది. ప్రముఖ టిప్‌స్టర్ హెమ్మెర్‌స్టోఫర్ , జోల్లేజ్ షేర్ చేసిన రెండర్స్ ప్రకారం...సోనీ ఎక్స్‌పీరియా ఎస్ III వాటర్ డ్రాప్ స్టైల్ నాచ్‌తో 5.5 అంగుళాల డిస్‌ప్లేతో రానుంది. ఫింగర్ ప్రింట్ స్కానర్, 13 మెగా పిక్సెల్ రియర్ కెమెరాను కల్గి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ లేత ఆకుపచ్చ,బ్లాక్ కలర్ వేరియంట్లలో లభించనుంది.
సోనీ ఎక్స్‌పీరియా ఎస్ III స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 888 ఎస్‌ఓసీ చిప్‌తో రానున్నట్లు సమాచారం. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను పొందనుంది. యూఎస్‌బీ టైప్‌సీ ఛార్జింగ్ సపోర్ట్, 4500 ఎమ్‌ఎహెచ్ బ్యాటరీతో రానున్నట్లు టిప్‌స్టర్స్ తమ రెండర్స్‌లో పేర్కొన్నారు. ఇక ధర విషయానికి వస్తే..కొత్తగా లాంచైన ఐఫోన్ ఎస్‌ఈ స్మార్ట్‌ఫోన్ ధర సుమారు రూ. 33 వేలుగా ఉండగా..దీని కంటే తక్కువ ధరలో సోనీ ఎక్స్‌పీరియా ఎస్ III వచ్చే అవకాశం ఉందని టిప్‌స్టర్స్ అభిప్రాయపడ్డారు.
చదవండి: అనూహ్య నిర్ణయం! అక్కడ ఏటీఎంలు అన్నీ బంద్..! కారణం ఇదే..!
Comments
Please login to add a commentAdd a comment