
బార్సిలోనా: బార్సిలోనా స్పెయిన్ మాస్టర్స్ టోర్నమెంట్‌లో భారత షట్లర్ సైనా నెహ్వాల్‌కు చుక్కెదురైంది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఐదో సీడ్ సైనా 20–22, 19–21తో బుసానన్ ఒంగ్‌బామ్‌రుంగ్‌ఫాన్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడి ఇంటిదారి పట్టింది.
పురుషుల విభాగంలో మాత్రం అజయ్ జయరామ్ (భారత్) సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. క్వార్టర్స్ పోరులో అతను 21–14, 21–15తో థామస్ రౌజెల్ (ఫ్రాన్స్)పై గెలుపొందాడు. మరో మ్యాచ్‌లో సమీర్ వర్మ (భారత్) 21–17, 17–21, 12–21తో కున్లావుట్ విటిడ్‌సర్న్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడాడు.
Comments
Please login to add a commentAdd a comment