16 విజయాల రికార్డు సమం! | Real Madrid continue winning streak, equal Barcelona’s league record | Sakshi
Sakshi News home page

16 విజయాల రికార్డు సమం!

Published Mon, Sep 19 2016 1:59 PM | Last Updated on Mon, Sep 4 2017 2:08 PM

16 విజయాల రికార్డు సమం!

16 విజయాల రికార్డు సమం!

బార్సిలోనా:  తమ విజయపరంపరను కొనసాగిస్తున్న రియల్ మాడ్రిడ్ జట్టు  లా లీగా ఫుట్ బాల్ లీగ్లో వరుస విజయాల రికార్డును సమం చేసింది. ఆదివారం జరిగిన పోరులో  రియల్ మాడ్రిడ్ జట్టు 2-0 తేడాతో ఎస్పానెయోల్పై ఘన విజయం సాధించింది. తద్వారా లా లీగాలో 16 వరుస విజయాలు సాధించిన బార్సిలోనా  రికార్డును రియల్ మాడ్రిడ్ సమం చేసింది. మ్యాచ్ తొలి హాఫ్లో  జేమ్స్ రోడ్రిగ్వెజ్ గోల్ చేయడంతో రియల్ మాడ్రిడ్కు ఆధిక్యం లభించింది. అనంతరం ఆట 70వ నిమిషంలో కరీమ్ బెంజీమా మరో గోల్ చేయడంతో రియల్ మాడ్రిడ్కు స్పష్టమైన పైచేయి సాధించింది. కాగా, ఎస్పానెయోల్ జట్టు గోల్ చేయడానికి చివరకు ప్రయత్నించినా సఫలం కాలేదు.

2010-11 సీజన్లో బార్సిలోనా వరుసగా 16 లా లీగా లీగ్ విజయాలను సాధించిన సంగతి తెలిసిందే. దాదాపు ఐదు సంవత్సరాల తరువాత ఆ రికార్డును రియల్ మాడ్రిడ్ సమం చేయడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement