la liga
-
బార్సిలోనాతో ముదిరిన మెస్సీ వివాదం
బార్సిలోనా: ‘ఇక జట్టుతో కలిసి ఆడలేను... నన్ను విడుదల చేయండంటూ గత కొన్ని రోజులుగా మొత్తుకుంటూ వస్తోన్న తమ జట్టు ఆటగాడు లియోనెల్ మెస్సీ విషయంలో నిన్నటి దాకా మౌనంగా ఉన్న బార్సిలోనా... తాజాగా నోరు విప్పింది. మెస్సీ జట్టును వీడాలనుకుంటే... ఒప్పందంలో ఉన్న విడుదల షరతు ప్రకారం 700 మిలియన్ యూరోల (దాదాపు రూ. 6 వేల కోట్లు)ను చెల్లించాలంటూ ఆదివారం ఒక ప్రకటనను విడుదల చేసింది. అప్పుడే తాము మెస్సీతో ఉన్న కాంట్రాక్టును రద్దు చేసుకుంటామని బార్సిలోనా స్పష్టం చేసింది. వాస్తవానికి మెస్సీ కాంట్రాక్టు వచ్చే ఏడాదితో ముగుస్తుంది. అయితే ఏడాది ముందుగానే జట్టును వీడాలనుకున్న మెస్సీ... ఆ విషయాన్ని జట్టుకు తెలిపాడు. అందుకు ఒప్పందంలో ఉన్న ‘రద్దు నిబంధన’ను సైతం సూచించాడు. (చదవండి: సంయుక్త విజేతలుగా భారత్, రష్యా) దాని ప్రకారం మెస్సీ... ఒప్పందం గడువు కంటే ముందే జట్టును వీడాలనుకుంటే ఆ విషయాన్ని ఈ ఏడాది జూన్ 10 లోపు బార్సిలోనా యాజమాన్యానికి తెలియజేయాలి. అయితే మెస్సీ ఈ నెలలో జట్టును వీడతానని చెప్పడంతో... రద్దు నిబంధన చెల్లదంటూ బార్సిలోనా పేర్కొంది. అయితే ఈ విషయంలో మెస్సీ లాయర్ల వాదన మరోలా ఉంది. కరోనా వల్ల ‘ల లీగ’ తాజా సీజన్ జూలై వరకు జరగడంతో... ఆగస్టు 31 వరకు రద్దు నిబంధనను ఉపయోగించే వీలు మెస్సీకి ఉందని లాయర్లు పేర్కొంటున్నారు. ఈ వివాదంలో ‘ల లీగ’ బార్సిలోనాకే మద్దతు పలకడం విశేషం. తాజా పరిస్థితుల నేపథ్యంలో బార్సిలోనాను వీడాలనుకుంటున్న మెస్సీకి ఇప్పుడు రెండే దార్లు ఉన్నాయి. అందులో ఒకటి... అతడు 700 మిలియన్ యూరోలను చెల్లించడం... రెండోది అతడి కోసం వేరే జట్టు ఆ మొత్తాన్ని బార్సిలోనాకు చెల్లించడం. 20 ఏళ్లుగా తమకు సేవలు అందించిన మెస్సీ పట్ల బార్సిలోనా ఇంత కఠినంగా వ్యవహరించడం మంచిది కాదంటూ అతడి అభిమానులు పేర్కొంటున్నారు. కరోనా పరీక్షకు మెస్సీ దూరం 2020–21 ‘ల లీగ’ ఫుట్‌బాల్ లీగ్‌లో భాగంగా... బార్సిలోనా జట్టు ప్రీ సీజన్ ట్రయినింగ్ క్యాంపును ఏర్పాటు చేసింది. అందులో భాగంగా తమ ఆటగాళ్లందరికీ కరోనా పరీక్షలు నిర్వహించగా... మెస్సీ మాత్రం అందుకు దూరంగా ఉన్నాడు. అతడు మాత్రమే కరోనా పరీక్ష చేయించుకోలేదని ఆ జట్టు అధికారి ఒకరు తెలిపారు. ఈ క్యాంపు నేటి నుంచి ఆరంభం కానుంది.(చదవండి: హామిల్టన్‌కే టైటిల్) -
అభిమానులకు షాకిచ్చిన మెస్సీ
అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ తన అనూహ్య నిర్ణయంతో ఫుట్‌బాల్ ప్రపంచానికి షాకిచ్చాడు. దాదాపు రెండు దశాబ్దాల పాటు బార్సిలోనా క్లబ్‌కు ఆడిన ఈ ఫుట్‌బాల్ దిగ్గజం.. ఆ జట్టును వీడుతున్నట్లు తెలిపాడు. ఈ విషయాన్ని జట్టు యాజమాన్యం కూడా ధృవీకరించింది. మెస్సీ తన నిర్ణయాన్ని బ్యూరోఫాక్స్ ద్వారా తెలియజేశాడని, వెంటనే బోర్డు మీటింగ్‌కు పిలుపునిచ్చామని తెలిపింది. అయితే 11 రోజుల క్రితం చాంపియన్స్‌లీగ్‌లో ఎదురైన ఘోరపరాజయంతోనే మెస్సీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. లీగ్ క్వార్టర్ ఫైనల్లో మెస్సీ నేతృత్వంలోని బార్సీలోనా జట్టు 2-8తో బేర్న్ మునిచ్ చేతిలో చిత్తుగా ఓడింది. ఇది మెస్సీ కెరీర్లోనే అత్యంత ఘోర పరాజయంగా చెప్పొచ్చు. అంతేకాకుండా 2007-08 సీజన్ నుంచి టైటిల్స్ గెలుస్తున్న ఆ జట్టుకు ఇది ఘోరపరాభావం. బార్సిలోనా క్లబ్‌కు మెస్సీ పంపిన పత్రం సీజన్ ముగింపులో క్లబ్ వీడొచ్చనే నిబంధనను పేర్కొన్నాడు. అయితే ఆ రూల్ గడువు జూన్‌లోనే ముగిసిందని, దీనిపై న్యాయ సలహా తీసుకుంటామని క్లబ్ ప్రకటించింది. బార్సిలోనా క్లబ్‌కు చెందిన మాసియా యూత్ అకాడమీలో 2001లో చెరిన మెస్సీ.. 2003లో 16 ఏళ్ల వయసులో క్లబ్ తరఫున అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి బార్సిలోనాకు మొత్తం 34 టైటిళ్లు అందించాడు. లియోనల్ మెస్సీ.. క్లబ్‌లోనే అత్యధిక వ్యక్తిగత రికార్డు ఉన్న ఆటగాడు. క్లబ్ తరపున 731 మ్యాచ్‌లు ఆడి 634 గోల్స్ చేశాడు.(చదవండి : మెస్సీ ఎట్ 700) -
క్వారంటైన్లో నువ్వు.. బయట నేను!
మాడ్రిడ్: ఫుట్‌బాల్ క్రీడాకారుడు ఎజ్విక్వైల్ గారే (33)కు కరోనా సోకింది. లా లీగా లీగ్‌లో వెలెన్సియా తరఫున ఆడుతున్న అర్జెంటీనా మిడ్‌ఫీల్డర్ గారే కరోనా బారిన పడ్డాడు. దాంతో అతన్ని ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాన్ని అతడే స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ‘ఈ ఏడాది దుర్ముహూర్తంలో ప్రారంభమైంది. తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న నాకు వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలింది. ఐసోలేషన్ వార్డులో చికిత్స తీసుకుంటున్నా’ అని గారే తెలిపాడు. స్పెయిన్ జరగాల్సిన ఉన్న లా లీగాకు కూడా కరోనా సెగ తగలడంతో దాన్ని రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గారేకు కరోనా వైరస్ సోకింది. స్పెయిన్‌లో ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 9,190 కరోనా కేసులు నమోదవగా.. అందులో 300కి మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.(కరోనా వైరస్ ఓ సునామీ) భార్య భావోద్వేగ ఫొటో ఎజ్విక్వైల్ గారే కరోనా బారిన పడటంతో అతని భార్య తమరా గోర్రో ఆవేదన వ్యక్తం చేశారు. గారేను ఆస్పత్రి ఐసోలేషన్ వార్డులో క్వారంటైన్ (నిర్భంధం)లో ఉంచిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. కరోనా మనిద్దరికీ అడ్డుగోడలా నిలిచి సెపరేట్ చేసిందంటూ భావోద్వేగ ఫోటో పెట్టారు. అభిమానుల హృదయాల్ని గెలుచుకున్న ఈ ఫోటో.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం గారే పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ చదవండి:గ్రాండ్ ప్రిన్సెస్’లో చిక్కుకుపోయిన 100 మంది భారతీయులు కరోనా సోకి యువ కోచ్ మృతి View this post on Instagram ❤️JUNTOS EN LA DISTANCIA❤️ (Eze lleva mascarilla por recomendación médica) #mamamolona #quedateencasa #otroreto #👑 A post shared by Tamara Gorro (@tamara_gorro) on Mar 16, 2020 at 5:07am PDT -
34వ హ్యాట్రిక్‌తో అరుదైన ఘనత
మాడ్రిడ్: అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ అరుదైన మైలురాయిని సాధించాడు. ప్రతిష్టాత్మక స్పెయినీష్ లీగ్ లాలీగా టోర్నమెంట్లో భాగంగా సెల్టా విగోతో జరిగిన మ్యాచ్‌లో బార్సిలోనా తరఫున ఆడుతున్న మెస్సీ హ్యాట్రిక్ గోల్స్‌తో అదరగొట్టాడు. ఫలితంగా బార్సిలోనా 4-1 తేడాతో సెల్టా విగోపై విజయం సాధించి పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచింది. కాగా, ఈ మ్యాచ్‌లో మెస్సీ హ్యాట్రిక్ గోల్స్ సాధించడంతో పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో సరసన నిలిచాడు. ఓవరాల్ లా లీగా టోర్నమెంట్లో అత్యధికంగా హ్యాట్రిక్ గోల్స్ సాధించిన జాబితాలో ఇప్పటివరకూ రొనాల్డ్ ఉండగా, ఇప్పుడు మెస్సీ కూడా చేరిపోయాడు. లాలీగా టోర్నీలో మెస్సీకి ఇది 34వ హ్యాట్రిక్. తొలి అర్థభాగంలో ఫ్రీకిక్ ద్వారా గోల్ సాధించిన మెస్సీ.. రెండో అర్థ భాగంలో మరో రెండు గోల్స్ సాధించి హ్యాట్రిక్ గోల్స్ ఘనతను ఖాతాలో వేసుకున్నాడు. ఇక గేమ్ చివర్లో సెర్గియో బస్య్కూట్ గోల్ సాధించడంతో బార్సిలోనా ఘన విజయం సాధించింది. కాగా, చివరి మూడు గేమ్‌ల్లో బార్సిలోనాకు ఇది తొలి విజయం. -
16 విజయాల రికార్డు సమం!
బార్సిలోనా: తమ విజయపరంపరను కొనసాగిస్తున్న రియల్ మాడ్రిడ్ జట్టు లా లీగా ఫుట్ బాల్ లీగ్‌లో వరుస విజయాల రికార్డును సమం చేసింది. ఆదివారం జరిగిన పోరులో రియల్ మాడ్రిడ్ జట్టు 2-0 తేడాతో ఎస్పానెయోల్పై ఘన విజయం సాధించింది. తద్వారా లా లీగాలో 16 వరుస విజయాలు సాధించిన బార్సిలోనా రికార్డును రియల్ మాడ్రిడ్ సమం చేసింది. మ్యాచ్ తొలి హాఫ్‌లో జేమ్స్ రోడ్రిగ్వెజ్ గోల్ చేయడంతో రియల్ మాడ్రిడ్‌కు ఆధిక్యం లభించింది. అనంతరం ఆట 70వ నిమిషంలో కరీమ్ బెంజీమా మరో గోల్ చేయడంతో రియల్ మాడ్రిడ్‌కు స్పష్టమైన పైచేయి సాధించింది. కాగా, ఎస్పానెయోల్ జట్టు గోల్ చేయడానికి చివరకు ప్రయత్నించినా సఫలం కాలేదు. 2010-11 సీజన్లో బార్సిలోనా వరుసగా 16 లా లీగా లీగ్ విజయాలను సాధించిన సంగతి తెలిసిందే. దాదాపు ఐదు సంవత్సరాల తరువాత ఆ రికార్డును రియల్ మాడ్రిడ్ సమం చేయడం విశేషం.