ముఖం చూపిస్తే.. డబ్బులిస్తుంది  | ATM With Face Recognition In Barcelona | Sakshi
Sakshi News home page

ముఖం చూపిస్తే.. డబ్బులిస్తుంది 

Published Sun, Feb 17 2019 6:30 AM | Last Updated on Sun, Feb 17 2019 9:31 AM

ATM With Face Recognition In Barcelona - Sakshi

డబ్బులు కావాలంటే.. ఏటీఎంకి వెళ్లి తీసుకుంటాం. ఆ మెషీన్‌లో కార్డు ఉంచి పిన్‌ నంబర్‌ ఎంటర్‌ చేసి.. కావాల్సిన డబ్బులు తీసుకుంటాం. అయితే ఆ పిన్‌ నంబర్‌ మర్చిపోయినా.. వేరే అపరిచితులకు ఆ నంబర్‌ తెలిసినా ఇబ్బందులు తప్పవు. అందుకోసం బ్యాంకులు చాలా ఏర్పాట్లు చేశాయి. కానీ స్పెయిన్‌లోని బార్సిలోనా సిటీలో ఉన్న ఓ బ్యాంకు డబ్బులు తీసుకునేందుకు ఏటీఎం కేంద్రాల్లో వినూత్నమైన ఏర్పాటు చేసింది. ఏంటంటే మన ముఖాన్ని గుర్తుపట్టి డబ్బులు ఇచ్చే నూతన సాంకేతికతను అందుబాటులోకి తెచ్చింది. ఫేషియల్‌ రికగ్నిషన్‌ ద్వారా డబ్బులు ఇచ్చే ఏటీఎం ఏర్పాటు చేయడం ప్రపంచంలోనే ఇది తొలిసారి కావడం విశేషం. అక్కడి కెయిక్సా బ్యాంకు ఈ టెక్నాలజీని వాడుకుంటోంది. దీనిద్వారా మన డబ్బు ఎంతో సేఫ్‌గా డ్రా చేసుకోవచ్చని బ్యాంకు చైర్మన్‌ జోర్డీ గాల్‌ తెలిపారు. ఏటీఎంలోని కెమెరా మన ముఖంలోని దాదాపు 16 వేల అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే మనకు డబ్బు ఇస్తుందట. అంతేకాదు నిరక్షరాస్యులు కూడా చాలా సులభంగా ఈ ఏటీఎంల ద్వారా ఎంతో సురక్షితంగా డబ్బును తీసుకోవచ్చు. ఈ ఏడాది చివరికి బార్సిలోనా పట్టణంలో అన్ని ఏటీఎం కేంద్రాల్లో ఈ వ్యవస్థలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్లు కెయిక్సా బ్యాంకు సీఈవో గొంజాలో చెబుతున్నారు. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement