కోలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ నయనతార- విగ్నేశ్ శివన్ వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. మహాబలిపురంలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే పెళ్లి తర్వాత కూడా ఇద్దరూ సినిమాలతో బిజీ అయిపోయారు. తాజాగా ఈ కొత్తజంట పని నుంచి బ్రేక్ తీసుకొని హనీమూన్‌కు చెక్కేశారు. స్పెయిన్‌లో బార్సిలోనాలో వెకేషన్‌కు వెళ్లారు.
దీనికి సంబంధించిన ఫోటోలను విగ్నేశ్ శివన్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇందులో నయన్ తాళిబొట్టుతో కనిపించడం విశేషం. మోడ్రన్ డ్రెస్సుల్లోనూ నయన్ తాళిబొట్టుతో మెస్మరైజ్ చేస్తుంది. నయన్ తాళిని ఫ్యాషన్ ట్రెండ్‌గా క్రియేట్ చేస్తుందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment