honey moon
-
భర్తతో నయన్ వెకేషన్.. ఫోటోలు వైరల్
కోలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ నయనతార- విగ్నేశ్ శివన్ వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. మహాబలిపురంలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే పెళ్లి తర్వాత కూడా ఇద్దరూ సినిమాలతో బిజీ అయిపోయారు. తాజాగా ఈ కొత్తజంట పని నుంచి బ్రేక్ తీసుకొని హనీమూన్‌కు చెక్కేశారు. స్పెయిన్‌లో బార్సిలోనాలో వెకేషన్‌కు వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలను విగ్నేశ్ శివన్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇందులో నయన్ తాళిబొట్టుతో కనిపించడం విశేషం. మోడ్రన్ డ్రెస్సుల్లోనూ నయన్ తాళిబొట్టుతో మెస్మరైజ్ చేస్తుంది. నయన్ తాళిని ఫ్యాషన్ ట్రెండ్‌గా క్రియేట్ చేస్తుందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) -
హనీమూన్ కోసం మాల్దీవులకు వెళ్లిన బాలీవుడ్ నటి
బాలీవుడ్ నటి దియా మీర్జా ఇటీవలె రెండో పెళ్లి చేసుకున్న చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రియుడు, వ్యాపారవేత్త వైభవ్ రేఖీతో ముంబై బాంద్రాలోని నివాసంలో అతి కొద్దిమంది స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. పెళ్లి తర్వాత భర్త వైభవ్‌తో కలిసి హనీమూన్ కోసం మాల్దీవులకు వెళ్లింది. ఈ సందర్భంగా మాల్దీవుల అందాలను ఆస్వాదిస్తున్న నటి..అక్కడి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. 'ప్రతీ క్షణాన్ని ఎంజాయ్ చేస్తున్నాం. స్వర్గంలా ఉన్నట్లుంది' అంటూ మాల్దీవులపై మనసు పారేసుకుంది. భర్తతో కలిసి మాల్దీవుల్లో సేద తీరుతున్న దియా..అక్కడి అందాలను కెమెరాలో బంధిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక 2014లో నిర్మాత సాహిల్ సంఘాను పెళ్లి చేసుకున్న దియా మీర్జా కొన్ని వ్యక్తిగత కారణాలతో అతని నుంచి విడిపోయారు. తమ అయిదేళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలికుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. భర్తతో విడాకుల అనంతరం వైభవ్ రేఖీ అనే వ్యాపారవేత్తను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వైభవ్‌కి కూడా ఇది రెండో పెళ్లి కాగా, దియా కంటే అతను నాలుగేళ్లు చిన్నవాడు కావడం విశేషం. ఇక సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో ఆమె మెదటిసారి నాగార్జునతో కలిసి వైల్డ్ డాగ్ అనే చిత్రంలో నటించింది. ఈ సినిమా ఏప్రిల్2న విడుదల కానుంది. View this post on Instagram A post shared by Dia Mirza (@diamirzaofficial) చదవండి : రెండో వివాహం.. ట్రెండ్ సెట్ చేసిన నటి నటి మలైకాకు మాజీ భర్త నుంచి స్పెషల్ గిఫ్ట్ -
హనీమూన్‌కు వెళుతున్న కొత్త జంట
ముంబై : ప్రేమించిన ప్రియుడిని పెళ్లాడి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్. గత వారం కాజల్ తన చిరకాల స్నేహితుడు గౌతమ్ కిచ్లును కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహామాడారు. ముంబైలోని ఓ హోటల్లో ఈ వేడుక గ్రాండ్‌గా జరిగింది. ప్రస్తుతం కాజల్ భర్త కిచ్లుతో ముంబైలో ఉన్నారు. కాగా పెళ్లి అనంతరం కేవలం రెండు వారాలు మాత్రమే బ్రేక్ తీసుకొని మళ్లీ సినిమా షూటింగ్లో కాజల్ పాల్గొననున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో ఫిమేల్ లీడ్‌లో కాజల్ నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్లో కాజల్ మరో వారంలో తిరిగి జాయిన్ కానున్నారని, ఈ షెడ్యూల్డ్ పూర్తి అయిన తరువాత హనీమూన్ ప్లాన్ చేసుకోనున్నట్లు వదంతులు వ్యాపించాయి. చదవండి: కాజల్ అగర్వాల్ వెరీ వెరీ స్పెషల్ అయితే ఈ వార్తలకు భిన్నంగా కాజల్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. సినిమా షూటింగ్‌కు ముందే నూతన దంపతులు ఇద్దరు ఇప్పుడే హనీమూన్ ప్లాన్ చేసుకున్నారు. ఈ విషయాన్ని కాజల్ తన సోషల్ మీడియా అకౌంట్లో తెలిపారు. తాము హానీమూన్ వెళుతున్నట్లు శనివారం ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్టు చేశారు. తమ పేర్లతో ఉన్న పౌచ్‌లతో పాటు పాస్ట్ పోర్ట్లని షేర్ చేశారు. దీనికి ‘బ్యాగ్స్ ప్యాక్ చేసుకున్నాం.. రెడీ టూ గో’ అనే కామెంట్ చేశారు. అయితే ఎక్కడికి వెళుతున్నారనేది మాత్రం చెప్పలేదు. ఇదిలా ఉండగా కాజల్, గౌతమ్ జంటకు నెటిజన్స్ హ్యాపీ జర్నీ అని కామెంట్స్ పెడుతున్నారు. చదవండి: కాజల్ నో చెప్పింది ఇందుకే.. -
కరోనాతో గాయకుడి హనీమూన్ రద్దు!
కర్ణాటక,మైసూరు: కరోనా ఎఫెక్ట్ కన్నడ గాయకుడు చందన్‌శెట్టికి కూడా తాకింది. ఇటీవల మైసూరులో చందన్‌శెట్టి, నివేదితా గౌడల వివాహం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. వివాహం తరువాత వీరిరువురు హనీమూన్‌కు ఇటలీకి వెళ్లారు. కానీ ప్రస్తుతం ఇటలీలో కరోనా వైరస్ ప్రభావం చాలా ఎక్కువగా ఉండడంతో తమ ప్రయాణాన్ని అర్ధాంతరంగా రద్దు చేసుకుని తిరిగి రానున్నారు. అయితే వారిరువురికి కచ్చితంగా వైద్య పరీక్షలు నిర్వహించి కరోనా లేదని నిర్ధారించాకే నగరంలోకి అనుమతించాలని కొందరు సంఘ నేతలు జిల్లా కలెక్టర్‌కు మనవి చేశారు. అందరూ సామాన్యుల తరహాలోనే వారికి పరీక్షలు నిర్వహించాలని కోరారు. కాగా, మైసూరులో ఇప్పటివరకు ఎవరికీ కరోనా వైరస్ సోకలేదు. -
బజాజ్ ఫైనాన్స్ నుంచి హానీమూన్ హాలిడే కవరేజీ
హైదరాబాద్: హానీమూన్ పర్యటనకు సంబంధించి అన్ని రకాల కవరేజీతో కూడిన ప్లాన్‌ను బజాజ్ ఫైనాన్స్ ఆవిష్కరించింది. రూ.699 ప్రీమియంకు రూ.3 లక్షల కవరేజీ పొందొచ్చని కంపెనీ తెలిపింది. పర్యటన సమయంలో ఊహించని ఘటనలు జరిగితే కవరేజీ పొందొచ్చని తెలియజేసింది. అంటే.. చివరి నిమిషంలో పర్యటన రద్దు చేసుకోవాల్సి వస్తే, బ్యాగేజీ కోల్పోతే, అత్యవసరంగా ఆస్పత్రిలో చేరాల్సి వస్తే, హానీమూన్ పర్యటనలో ఉన్నప్పుడు తమ ఇళ్లలో దొంగతనాల కారణంగా ఎదురయ్యే నష్టానికి ఈ ప్లాన్ కింద పరిహారం పొందొచ్చని బజాజ్ ఫైనాన్స్ తెలిపింది. -
హ్యాపీ..హనీమూన్
ఈ సమ్మర్ వివాహాల సీజన్. పెళ్లితో ఒక్కటైన నూతన జంట హనీమూన్‌కు ప్రణాళికలు వేసుకునే సమయం. నూతన వధూవరులకు హనీమూన్ ఒక మధురానుభూతి. మరి... ఆ టూర్ అంతే అందంగా సాగాలంటే విడిదే కీలకం. ఈ హాట్.. హాట్ సమ్మర్లో కూల్..కూల్ ప్లేస్ అయితేనే బాగుంటుంది. జాతీయ,అంతర్జాతీయ స్థాయిలోని హనీమూన్ స్పాట్స్ ఇదిగో. సాక్షి, సిటీబ్యూరో : హిమాచల్‌ప్రదేశ్‌లోని షిమ్లా, మనాలి.. వెస్ట్‌బెంగాల్‌లోని సిక్కిం, డార్జిలింగ్.. కర్టాటకలోని కూర్గ్.. ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్, రాజస్థాన్‌లోని పింక్‌సిటీ జైసల్మేర్, తమిళనాడులోని ఊటి, జమ్మూకశ్మీర్, గోవా, కేరళ, అండమాన్ నికోబార్ దీవులు తదితర ప్రాంతాలు మన దేశంలో హనీమూన్ స్పాట్స్‌గా ప్రసిద్ధి చెందాయి. ఇక అంతర్జాతీయ స్థాయిలో ప్యారిస్, మారిషస్, మాల్దీవులు, థాయ్‌లాండ్, శ్రీలంక, న్యూజిలాండ్, మెక్సికో, గ్రీస్, ఫ్రాన్స్, ఇటలీ, కరేబియన్ దీవులు ఫేమస్. తెలంగాణలోని లక్నవరం కూడా ఇప్పుడిప్పుడే హనీమూన్ స్పాట్‌గా ఆకట్టుకుంటోంది. కొత్త జంటలు ఇక్కడికి వెళ్లేందుకు ఆసక్తి చూపుతుండడం విశేషం. ప్రణాళిక ముఖ్యం... ♦ ముందుగా హనీమూన్ ప్రణాళిక వేసుకోవడంచాలా ముఖ్యం. బడ్జెట్‌కు అనుగుణంగాప్రాంతాలను ఎంచుకోవాలి. ♦ వీలైనంత వరకు తక్కువ లగేజీ ఉండేలా చూసుకోవాలి. ♦ హనీమూన్ స్పాట్లో ఉండే వాతావరణానికి అనుగుణంగాప్రిపరేషన్ ఉండాలి. అవసరమైన మెడిసిన్ తీసుకెళ్లాలి. ♦ ఈ టూర్లో ప్రతి క్షణం.. ఒక మధుర జ్ఞాపకం.వీటన్నింటినీ బంధించేందుకు కెమెరా తీసుకెళ్తే బాగుంటుంది. ♦ ఆభరణాలు ఎక్కువగా తీసుకెళ్లకపోవడం మంచిది. భద్రత పరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే విధంగా నగదు కూడా ఎక్కువగా వెంట ఉంచుకోవద్దు. అవసరమైనప్పుడల్లా ఏటీఎంలలో తీసుకుంటే సరి. ♦ ఆయా ప్రాంతాల గురించి ముందుగా తెలుసుకోవడం మంచిది. అక్కడి ఆచార వ్యవహారాలు, వాతావరణం, కరెన్సీ... ఇలా విభిన్న సమాచారం నెట్లో తెలుసుకోవచ్చు. తెలుసుకోండిలా.. నగరంలోని వివిధ ట్రావెల్ ఏజెన్సీలు హనీమూన్ ప్యాకేజీలు అందజేస్తున్నాయి. అదే విధంగా తెలుగు రాష్ట్రాల టూరిజం సంస్థలు కూడా దీనిపై సమాచారం ఇస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని టూరిజం ప్రాంతాల సమాచారం కోసం 180042546464, 04023414334, 04023400516 , 04065574231, 04023052028 నంబర్లలో సంప్రదించొచ్చు. అదే విధంగా జాతీయ, అంతర్జాతీయ ప్రాంతాల సమాచారం కోసం ఇండియన్ టూరిజం సెంటర్ 04023409199 నంబర్లో సంప్రదించొచ్చు. -
విరుష్క... ఆ స్వర్గమేంటో తెలిసిపోయింది
సాక్షి, స్పోర్ట్స్/సినిమా : డిసెంబర్ 11న వివాహం తర్వాత అనుష్క-కోహ్లి హనీమూన్ ఎక్కడికి వెళ్లారంటూ ఆరాలు తీయటం కొందరి వంతు అయ్యింది. ఇంతలో అనుష్క స్వర్గంలో ఉన్నామంటూ ఓ ఫోటోను షేర్ చేయటంతో ఆ ఆత్రుత మరింతగా పెరిగిపోయింది. సోషల్ మీడియాలో దర్శనమివ్వటంతో ఎవరికి తోచిన రీతిలో వారు కథనాలు, మరికొందరు కామెంట్లతో సెటైర్లు పేల్చారు. సౌతాఫ్రికా, ఆస్టేలియా గోల్డ్ కోస్ట్, ఫ్రెంచ్ రివరియా, మాల్దీలు ఇలా ఎవరికి తోచిన పేర్లను వారు చెప్పేశారు. అయితే ఇప్పుడు ఎట్టకేలకు ఆ సస్పెన్స్ వీడింది. ప్రస్తుతం ఈ ఇద్దరూ ఫిన్లాండ్లో ఉన్నట్లు చేస్తున్నారని ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక కథనం ప్రచురించింది. మొన్న ప్రచురించిన ఫోటో కూడా అక్కడిదేనని.. రోవనేమి, ల్యాప్‌లాండ్ ప్రాంతంలో వీరు బస చేశారని అందులో పేర్కొంది. ఫిన్లాండ్లో వీరిద్దరి స్వేచ్ఛా విహారం గురించి అక్కడి మీడియా సంస్థ కూడా కథనం ప్రచురించింది కూడా. ఇటలీలోని 13వ శతాబ్దానికి చెందిన బోర్గో ఫినోచ్చిటో రిసార్ట్‌లో వైభవంగా ఈ జంట వివాహం చేసుకున్న వివాహం తెలిసిందే. In heaven, literally 😇😍 A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on Dec 15, 2017 at 12:25am PST -
భర్త హనీమూన్ ప్లాన్‌తో అసిన్ థ్రిల్
ముంబై: హీరోయిన్ అసిన్, బిజినెస్ మేన్ రాహుల్ శర్మ ప్రేమ, పెళ్లి వ్యవహారం మొదటి నుంచి ఆసక్తికర వార్తలు గానే నిలిచాయి.. ఇపుడు ఈ కొత్త దంపతుల హనీమూన్ ట్రిప్ కూడా సర్ప్రైజింగ్ గానే ఉంది. తన డార్లింగ్ తో హనీమూన్ సందర్భంగా స్పెషల్ సర్ప్రైజ్ ప్లాన్ చేసాడట రాహుల్ శర్మ. ముందుగా అనుకున్నట్లు కాకుండా ప్లాన్ మార్చి ఆమెను థ్రిల్ చేశాడట. అయితే ఈ నవదంపతులు తొలుత హార్వర్డ్ బోస్టన్ వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారట. కానీ అసిన్ ను సర్ప్రైజ్ చేయడానికి ఆమెకు ముందుగా చెప్పని లొకేషన్లకు తీసుకెళ్లి ఆశ్చర్యంలో ముంచెత్తాలనేది రాహుల్ ఆలోచన. తన ముద్దులభార్యకు తెలియకుండా డిఫరెంట్ డిఫరెంట్ ప్రదేశాలకు తీసుకెళ్లడం ద్వారా తమ హనీమూన్ మరింత గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవాలని రాహుల్ నిర్ణయించాడట. కాగా బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ సినిమాలో నటించిన సమయంలో అసిన్ కు రాహుల్ శర్మ పరిచయం, ప్రేమ, పెళ్లి తెలిసిన విషయాలే. జనవరి 19న రెండు సంప్రదాయాల ప్రకారం వీరి వివాహం గ్రాండ్ గా జరిగింది. -
అమలా హనీమూన్ కల చెదిరిందిలా..!