
హైదరాబాద్: హానీమూన్ పర్యటనకు సంబంధించి అన్ని రకాల కవరేజీతో కూడిన ప్లాన్‌ను బజాజ్ ఫైనాన్స్ ఆవిష్కరించింది. రూ.699 ప్రీమియంకు రూ.3 లక్షల కవరేజీ పొందొచ్చని కంపెనీ తెలిపింది. పర్యటన సమయంలో ఊహించని ఘటనలు జరిగితే కవరేజీ పొందొచ్చని తెలియజేసింది. అంటే.. చివరి నిమిషంలో పర్యటన రద్దు చేసుకోవాల్సి వస్తే, బ్యాగేజీ కోల్పోతే, అత్యవసరంగా ఆస్పత్రిలో చేరాల్సి వస్తే, హానీమూన్ పర్యటనలో ఉన్నప్పుడు తమ ఇళ్లలో దొంగతనాల కారణంగా ఎదురయ్యే నష్టానికి ఈ ప్లాన్ కింద పరిహారం పొందొచ్చని బజాజ్ ఫైనాన్స్ తెలిపింది.