
కర్ణాటక,మైసూరు: కరోనా ఎఫెక్ట్ కన్నడ గాయకుడు చందన్‌శెట్టికి కూడా తాకింది. ఇటీవల మైసూరులో చందన్‌శెట్టి, నివేదితా గౌడల వివాహం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. వివాహం తరువాత వీరిరువురు హనీమూన్‌కు ఇటలీకి వెళ్లారు. కానీ ప్రస్తుతం ఇటలీలో కరోనా వైరస్ ప్రభావం చాలా ఎక్కువగా ఉండడంతో తమ ప్రయాణాన్ని అర్ధాంతరంగా రద్దు చేసుకుని తిరిగి రానున్నారు. అయితే వారిరువురికి కచ్చితంగా వైద్య పరీక్షలు నిర్వహించి కరోనా లేదని నిర్ధారించాకే నగరంలోకి అనుమతించాలని కొందరు సంఘ నేతలు జిల్లా కలెక్టర్‌కు మనవి చేశారు. అందరూ సామాన్యుల తరహాలోనే వారికి పరీక్షలు నిర్వహించాలని కోరారు. కాగా, మైసూరులో ఇప్పటివరకు ఎవరికీ కరోనా వైరస్ సోకలేదు.
Comments
Please login to add a commentAdd a comment